Relationship Tips: అబ్బాయిలలో అమ్మాయిలు ఈ 5 విషయాలను ముందుగానే గమనిస్తారట

Subhash Goud

Subhash Goud |

Updated on: Jan 30, 2023 | 9:53 PM

ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించిన తర్వాత మొదటి సారిగా కలుసుకోవడం, అలాగే అబ్బాయిలు పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు అమ్మాయిలు అబ్బాయిల ప్రవర్తనను సులభంగా గమనిస్తారట..

Relationship Tips: అబ్బాయిలలో అమ్మాయిలు ఈ 5 విషయాలను ముందుగానే గమనిస్తారట
అంతేకాకుండా శరీరం నుంచి వ్యర్థాలను సైతం తొలగిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కాల్షియం, యూరియా, టాక్సిన్‌లను తొలగించి.. మూత్రశాయాన్ని డిటాక్స్ చేస్తాయి.

ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించిన తర్వాత మొదటి సారిగా కలుసుకోవడం, అలాగే అబ్బాయిలు పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు అమ్మాయిలు అబ్బాయిల ప్రవర్తనను సులభంగా గమనిస్తారట. చాలా మంది అబ్బాయిలు మొదటి మీట్‌లోనే అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అమ్మాయిలు మొదటి మీట్‌లో అబ్బాయిలలో కొన్ని విషయాలను ముందుగా గమనిస్తారు. అమ్మాయిలు వారి శరీరానికి ఆకర్షితులవుతారు. తమ భాగస్వామి మాట్లాడే శైలి ఎలా ఉంటుందో మొదటి సారిగానే అమ్మాయిలు గమనిస్తారట. అతను ఎలా కూర్చుంటాడు.. లేచే విధంగా ఎలా ఉంటుందనే దానిపై దృష్టి సారిస్తారట. అయితే పురుషులలో మహిళలు గమనించే కొన్ని విషయాలను తెలుసుకుందాం. సైకాలజీ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

  1. అబ్బాయిల రూపాన్ని గమనిస్తారట: ఒకరి ప్రవర్తన ఒక రోజులో సరిగ్గా తెలియదని అంటారు. కానీ స్త్రీలు పురుషుల మొదటి సారిగా కలిసినప్పుడే వారి రూపాన్ని ఖచ్చితంగా గమనిస్తారు. ప్రతి అబ్బాయి మోడల్‌గానో, హీరోలానో కనిపించాల్సిన అవసరం లేదు.. కానీ లుక్స్ మ్యాటర్ అన్నది కూడా నిజం.
  2. డ్రెస్సింగ్ సెన్స్: అమ్మాయిలు ముఖాన్ని గమనించడమే కాకుండా అబ్బాయిల డ్రెస్సింగ్ సెన్స్ కూడా గమనిస్తారట. బట్టలు ఒకరి రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందనేది కూడా నిజం. అందుకే అమ్మాయిలను ఆకట్టుకోవడానికి డ్రెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.
  3. మాట్లాడే శైలి: అమ్మాయిలు లేదా మహిళలు మొదటిసారిగా పురుషుడిని కలుస్తుంటే వారు అతని నోరు విప్పడం ద్వారా అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారని సైకాలజీ నిపుణులు చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. ఒక అబ్బాయి లేదా అమ్మాయి యాస అవతలి వ్యక్తిని ఆకట్టుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
  4. గోర్లు కూడా ఒక ముఖ్యమైన భాగం: మీ వ్యక్తిత్వం ఎంత మంచిదో చెడ్డదో అందులో చేతి గోళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయట. అబ్బాయిలు లుక్‌ను ఉత్తమంగా మార్చడానికి డ్రెస్సింగ్, ముఖంపై దృష్టి పెడతారు. కానీ వారు గోళ్లను పట్టించుకోకుండా మర్చిపోతారు. గోళ్లు చేతుల అందాన్ని పెంపొందిస్తాయి. అందుకే వాటిపై జాగ్రత్తలు తీసుకోవాలి.
  5. ఇవి కూడా చదవండి

  6. శరీర వాసన: శరీర వాసన మొదటి అభిప్రాయంలో ప్రతికూలతను సృష్టించగలదు. అబ్బాయిల డియో లేదా పెర్ఫ్యూమ్ వాసన మంచిదా చెడ్డదా అని చాలా మంది అమ్మాయిలు ఖచ్చితంగా గమనిస్తారట. ఇది కాకుండా అమ్మాయిలు అబ్బాయిల భంగిమను కూడా గమనిస్తారు. వారు ఎలా నడుస్తున్నారు..? నడవడంలో ఏమైనా తేడా ఉందా అని కూడా గమనిస్తారట.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. సైకాలజీ నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది.)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu