Marriage relationship tips: నేటి కాలంలో చిన్న చిన్న విషయాలకే వైవాహిక సంబంధాలు తెగిపోతున్నాయి. వైవాహిక జీవితం అనంతరం సఖ్యత లేని కారణంగా భార్యభర్తలు మనస్పర్థలతో సంబంధాలను దూరం చేసుకుంటున్నారు. ప్రధానంగా చిన్న చిన్న విషయాలు, సందేహాలతో దంపతుల మధ్య దూరం పెరుగుతుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సంబంధం క్షీణించడానికి ప్రధానంగా ఆలుమగలు మధ్య ఏర్పడే పొరపచ్చాలే కారణం. లోతుగా ఆలోచించకుండా.. ప్రశ్నలకు సరైన సమాధానాలు వెతకకుండా విడిపోవాలనే నిర్ణయానికే వస్తారు. సంబంధాలు ఎంత వేగంతో ఏర్పడతాయో, అదే వేగంతో విచ్ఛిన్నమవుతాయి. అందుకే రిలేషన్ షిప్ లో ప్రేమను కలిగి ఉండటం చాలా ముఖ్యం. మరోవైపు, సంబంధంలో ప్రేమ స్థానంలో సందేహం, అనుమానం లాంటివి ఉంటే, అప్పుడు సంబంధం బలహీనంగా మారుతుంది. అంతే కాదు, రిలేషన్ షిప్ లో పురుషులు/మహిళలకు సందేహం వచ్చినప్పుడు.. దాని వల్ల, తగాదాలు, దూరాలు, మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. వీటికనుగుణంగా కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. తద్వారా సంబంధాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవచ్చు. ఎలాంటి అలవాట్ల వల్ల సంబంధంలో అనుమానాలు తలెత్తుతాయి.. ఎలాంటి విషయాల్లో సందేహం వస్తుంది.. ఇలాంటప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ అలవాట్ల కారణంగా వైవాహిక సంబంధంలో ప్రేమ స్థానంలో సందేహం వస్తుంది..
చాడీలు చెప్పడం- గూఢాచార్యం: సంబంధంలో కలహాలకు ప్రధాన కారణం చాడీలు చెప్పడం, గూఢాచార్యం చెప్పడం. రిలేషన్‌షిప్‌పై నమ్మకం ఉంచడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితుల్లో భాగస్వామి చిన్న విషయాలపై గూఢచర్యం చేసినా లేదా అతని మాటలను అనుమానించినా బంధాల మధ్య దూరం పెరుగుతుంది. హఠాత్తుగా ఎవరు ఫోన్ చేశారు..? ఎవరితో మాట్లాడుతున్నారు, ఇంతసేపు ఏం చేస్తున్నావు.. మొదలైన ప్రశ్నలు అడిగితే.. ఎదుటి వారు కలత చెందుతారు. ఈ కారణంగా సంబంధంలో గొడవలు మొదలవుతాయి. కాబట్టి గూఢచర్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి.
తరచుగా కాల్ చేయడం: కొంతమందికి పదే పదే తమ భాగస్వామికి ఫోన్ చేసి వేధించడం అలవాటుగా ఉంటుంది. భాగస్వామి ఫోన్ బిజీగా ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో ఈ అలవాటు భాగస్వామికి భంగం కలిగించవచ్చు. ఈ అలవాటును ఎప్పటికప్పుడు మార్చుకోవడం అవసరం. కావున ఒక సమయాన్ని నిర్ణయించుకుని.. దాని ప్రకారం భాగస్వామికి కాల్ చేయండి.
ఒకరి నుంచి ఒకరు ఎక్కువ ఆశించడం: సంబంధంలో ఒకరినొకరు విశ్వసించడం ముఖ్యం. కానీ భాగస్వామి నుంచి ఎక్కువ ఆశించకూడదు. మీ కోరికలను భాగస్వామిపై రుద్దడం ద్వారా, సంబంధంలో విభేదాలు మొదలవుతాయి. ఇలా ప్రవర్తించడం మూలంగా విసుగు చెందే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..