Relationship: ఈ 5 కారణాల వల్ల అస్సలు పెళ్లి చేసుకోవద్దు.. ఎందుకో తెలుసుకోండి..!
Relationship: వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ప్రేమ, కుటుంబ బాధ్యతలతో బంధించే ఒక సంబంధం. ఒక వ్యక్తి పూర్తిగా వివాహానికి సిద్దంగా ఉన్నప్పుడు మాత్రమే మూడుముళ్లు వేయాలి.
Relationship: వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ప్రేమ, కుటుంబ బాధ్యతలతో బంధించే ఒక సంబంధం. ఒక వ్యక్తి పూర్తిగా వివాహానికి సిద్దంగా ఉన్నప్పుడు మాత్రమే మూడుముళ్లు వేయాలి. లేదంటే చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల ఒత్తిడికి లోనై పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి వారు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఈ వ్యక్తులు వివాహం చేసుకోవడం వెనుక చాలా కారణాలని చెబుతారు. కానీ ఇవేవి సరైనవి కాదు. ఒక వ్యక్తి ఐదు కారణాల వల్ల ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదు. అలాంటి కారణాల గురించి తెలుసుకుందాం.
1. బ్రేకప్ నుంచి బయటపడటానికి
మీరు బ్రేకప్ నుంచి బయటపడటానికి, మీ మాజీ జ్ఞాపకాలను వదిలించుకోవడానికి వివాహం చేసుకోవాలనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. మీకు సరియైన భాగస్వామి ఎదురైనప్పుడే వివాహం చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది.
2. ప్రజల మాటలని నివారించడానికి
తల్లిదండ్రులు చాలాసార్లు పిల్లలని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. సకాలంలో పెళ్లి చేసుకోకపోతే తమ్ముళ్లకు, చెల్లెళ్లకి పెళ్లి జరగదని వాదిస్తారు. ఇదిలా ఉంటే చాలామంది మీ పిల్లలకి పెళ్లి చేయడం లేదని అడుగుతారు.. ఇలాంటి టెన్షన్లని నివారించడానికి పెళ్లి చేసుకుంటే మీకు భవిష్యత్‌లో చుక్కలు కనిపిస్తాయి. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి.
3. స్నేహితుల ఒత్తిడి వల్ల
మీ స్నేహితులందరూ వివాహం చేసుకున్నారు. మీరు మాత్రమే ఒంటరిగా ఉన్నారు. అప్పుడు అందరు కలిసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఇలాంటి సమయంలో తొందరపడకండి. మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేసుకోండి.
4. వయసు పెరుగుతుందనే భయం
చాలా మంది ఒక నిర్దిష్ట వయస్సులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. లేదంటే తమకి సరైన భాగస్వామి దొరకదని భావిస్తారు. ఇలా ఆలోచించి పెళ్లి చేసుకుంటే పెద్ద తప్పు చేసినట్టే. పెళ్ళికి తొందరపడవద్దు. సరైన భాగస్వామి దొరికినప్పుడు మాత్రమే వివాహం చేసుకోవాలి. అలా అని మితి మీరిన వయసు వరకు ఉండకూడదు.
5. ఆర్థిక భద్రత కోసం పెళ్లి వద్దు
చాలా మంది ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడం కోసం పెళ్లి చేసుకుంటారు. ఇలా చేస్తే జీవితం మొత్తం సమస్యలే ఉంటాయి. ఎందుకంటే డబ్బు వల్ల ఆనందం దొరుకుతుందని అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది.