Red Meat Side Effects: అతిగా మాంసం తింటే ఏమవుతుందో తెలుసా? మీ ఎముకలు బలంగా మారాలంటే మాత్రం తప్పదు!

వాస్తవానికి ఎముకలు దృఢంగా మారాలంటే మాంసాహారం తీసుకోవాలని చాలా మంది చెబుతుంటారు. అందుకోసమే బోన్స్ సూప్స్ తాగుతుంటారు. అయితే పోషకాహార నిపుణులు మాత్రం అతిగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకుంటే ఎముకలు బలహీనం అవుతాయని చెబుతున్నారు.

Red Meat Side Effects: అతిగా మాంసం తింటే ఏమవుతుందో తెలుసా? మీ ఎముకలు బలంగా మారాలంటే మాత్రం తప్పదు!
Meat
Follow us
Madhu

|

Updated on: Mar 20, 2023 | 5:15 PM

ఆదివారం వచ్చిందంటే ముక్కలేనిదే ముద్ద దిగదు. మటన్ లేదా చికెన్‌ లాగించేయాల్సిందే.. వాస్తవానికి మాంసాహారం తినడం వల్ల శరీరానికి కొన్ని పోషకాలు లభిస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తాయి. మాంసం పరిమితంగా తినడం వల్ల శరీరం బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ అతిగా తింటే మాత్రం చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని మాంసాహారాల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగి కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే జంతు మాంసకృత్తులు, ముఖ్యంగా ఎర్ర మాంసం ఆరోగ్యకరమైన ఎముకలకు అవసరమైనప్పటికీ, దానిని ఎక్కువగా తినడం వల్ల ఎముకలు  దెబ్బతింటాయని అధ్యయనాల్లో తేలింది. వాస్తవానికి ఎముకలు దృఢంగా మారాలంటే మాంసాహారం తీసుకోవాలని చాలా మంది చెబుతుంటారు. అందుకోసమే బోన్స్ సూప్స్ తాగుతుంటారు. అయితే పోషకాహార నిపుణులు మాత్రం అతిగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకుంటే ఎముకలు బలహీనం అవుతాయని చెబుతున్నారు. ఎముకల ఆరోగ్యానికి డెయిరీ, చేపలు, పౌల్ట్రీ, మొక్కల ఆధారిత ప్రొటీన్‌లు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పండ్లు, కూరగాయలు తృణధాన్యాలు కూడా ఎముకలను పుష్టినిస్తాయి. మరి రెడ్ మీట్ తో తినడం వల్ల ఎముకలకు కలిగే నష్టం ఏమిటి? ఎందుకు ఎముకల పుష్టికి నిపుణులు మాంసాహారాన్ని దూరం పెట్టాలని చెబుతున్నారు? చూద్దాం రండి?

  • అధిక ప్రోటీన్ ఆహారం, ముఖ్యంగా రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి.
  • మాంసం అధిక ఫాస్పరస్-కాల్షియం నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఇది మూత్రం ద్వారా కాల్షియం విసర్జనను పెంచుతుంది. ఇది ఎముకలో పోషకాలు తగ్గిపోయేలా చేస్తుంది.
  • ముఖ్యంగా ఎర్ర మాంసం కారణంగా రక్తం ఆమ్లంగా మారుతుంది. దీని కారణంగా ఎముకల నుండి కాల్షియం తొలగించబడుతుంది.

ఇవి తినండి..

బీన్స్, కాయధాన్యాలు, కూరగాయలు, తృణధాన్యాలు మాంసాహారానికి మంచి రిప్లేస్ మెంట్స్. మొక్కల ఆధారిత ప్రోటీన్లతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఎక్కువ మొక్కల ఆధారిత ప్రోటీన్లను తినడం వల్ల మీ డబ్బు కూడా ఆదా అవుతుంది. ఎందుకంటే అవి మాంసం కంటే చౌకగా ఉంటాయి. ఎరుపు, ప్రాసెస్ చేసిన మాంసాలు, శీతల పానీయాలు, వేయించిన ఆహారాలు, శుద్ధి చేసిన ధాన్యాలు తీసుకోవడం తగ్గించడం ఎముక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైయిల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..