Dental Problems: పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు!
దంత ఆరోగ్యం అనేది మన మొత్తం శరీర ఆరోగ్యానికి పునాది వంటిది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే.. ఖరీదైన చికిత్సలు కాకుండా, రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే అతని శరీరంలో ఉన్న అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. వాటిలో ఏది ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. మన తినే ఆహారాన్ని మెత్తగా చేసి కడుపులోకి పంపండంలో మన దంతాలు ఎంతో కీలకంగా పనిచేస్తాయి. కానీ ప్రస్తుతం చాలా మంది ఈ దంత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ప్రజలను వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ఈ సమస్యలు మొదటి స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.7 బిలియన్ల మంది దంత సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
చాలామంది పంటి నొప్పి లేదా చిగుళ్ల వాపు వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరకు వెళ్తుంటారు. కానీ, దంత సమస్యలు రాకముందే నివారించడం లేదా ప్రారంభ దశలోనే గుర్తించి వాటికి చికిత్స తీసుకోవడం ఉత్తమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ నాలుగు సూత్రాలు పాటిస్తే సరిపోతుంది అని నిపుణులు అంటున్నారు. దంతాలను, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖరీదైన చికిత్సల కంటే, రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే పాలించాల్సింది ఇవే
- రోజు బ్రష్ చేయడం: రోజుకు రెండుసార్లు కచ్చితంగా బ్రష్ చేయాలి.
- ఆహారపు అలవాట్లు : చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, స్నాక్స్‌ను తగ్గించాలి. ఇవి పళ్లపై బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి.
- దురలవాట్లకు దూరం: పొగాకు మరియు మద్యం సేవించడం వల్ల దంతాలు, చిగుళ్లే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటిని పూర్తిగా వదిలేయడమే మేలు.
- పౌష్టికాహారం: పండ్లు మరియు తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలకు అవసరమైన పోషకాలు అందుతాయి.
నిపుణుల సలహ
నోరు ఆరోగ్యంగా ఉంటేనే.. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీ దంత సంరక్షణను నిర్లక్ష్యం చేయకండి. చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే పెద్ద అనారోగ్య సమస్యలను అరికట్టవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
