Vastu Tips: ఇంట్లో ఆనందం, సంపద పెరగాలంటే ఇలా చేయండి..! మంచి రిజల్ట్ ఉంటుంది..!
ఇంట్లో శాంతి, ఆనందం, సంపద నెలకొనేలా వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యమే. ముఖ్యంగా లివింగ్ రూమ్ వాతావరణం మన జీవితంపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని ప్రత్యేకమైన ఫొటోలు లివింగ్ రూమ్లో ఉంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Vastu Tips
- ఉదయిస్తున్న సూర్యుడి చిత్రం.. తూర్పు గోడపై ఉదయిస్తున్న సూర్యుడి ఫోటో ఉంచితే, ఇంట్లో శుభతా, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇది కొత్త అవకాశాలు రావడానికి సహాయపడుతుందని చెబుతారు.
- పండ్లు లేదా పువ్వుల చిత్రం.. తూర్పు దిశలో పండ్లు లేదా అందమైన పువ్వుల చిత్రాన్ని ఉంచడం వల్ల ఇంట్లో శుభ శక్తులు ప్రవహిస్తాయి. ఇది సంతోషకరమైన వాతావరణాన్ని కలిగించడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత పెంచుతాయి.
- దేవుడు లేదా దేవతల ఫోటోలు.. ఇంటి హాల్లో దేవతల ఫోటోలు ఉంచడం చాలా శుభప్రదం. అయితే వాటిని తూర్పు-ఉత్తర గోడకు వేలాడదీయడం శ్రేయస్కరం. దీని వల్ల ఇంట్లో దైవ కృప ఉండి సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు.
- కొండల చిత్రం.. లివింగ్ రూమ్లో ఒక అందమైన కొండల ఫోటో పెట్టుకోవడం మంచి సంకేతం. ఇది మనసుకు ప్రశాంతతను అందించడంతో పాటు జీవితం ముందుకు సాగేందుకు మనోధైర్యాన్ని ఇస్తుంది.
- పక్షులు, గూడు.. తల్లి పక్షి తన పిల్లలతో గూడు కట్టుకుని ఉన్న ఫోటోను లివింగ్ రూమ్లో ఉంచితే కుటుంబం బలంగా నిలిచేలా ఉంటుందని నమ్ముతారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను, అవగాహనను పెంచుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.