AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజంగా ఇది పిచ్చిఆకుల చెట్టు కాదండోయ్.. కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది ఒట్టు..!

పిండి కూర ఆకును మనం పల్లెటూళ్లలో చాలాసార్లు చూశాం. మన ఇంటి ముందు, మన పెరట్లో, చెలకల్లో ఇది కనిపిస్తుంది. సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలకు రేగు పండ్లు, నవ ధాన్యాలతోపాటు ఈ పిండి కూర రెక్కలను కూడా అలంకరిస్తారు. దీనిని కొండపిండి చెట్టు అని, తెలగ పిండి చెట్టు అని కూడా పిలుస్తారు. దీనిని పాషాణభేది అని కూడా అంటారు. అంటే రాళ్లను కూడా కరిగిస్తుందని దీని అర్థం. కిడ్నీలో రాళ్లను కరిగించడంలో పిండి కూర ఆకు బాగా పనిచేస్తుందని మన ప్రాచీన ఆయుర్వేదం చెబుతోంది.

నిజంగా ఇది పిచ్చిఆకుల చెట్టు కాదండోయ్.. కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది ఒట్టు..!
Pindi Kura
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2025 | 9:01 PM

Share

పిండి కూర ఆకులో ఒక విశేషమైన గుణం ఉంది. ఈ పిండి కూర ఆకు కిడ్నీలో రాళ్లను ఇట్టే కరిగించేస్తుందట. ఈ పిండి కూర ఆకులు పిడికెడు తీసుకుని పరిగడుపున మూడు రోజులపాటు తీసుకుంటే సరిపోతుందని చెబుతారు. అంత శక్తిమంతమైన ఔషధ గుణం ఉన్న ఆకు ఇది. పిండి కూర వేర్లు, ఆకులు, పువ్వులు ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకుని తేయాకు పొడికి బదులుగా దీనిని వేసుకుని టీ చేసుకుని తాగొచ్చు. తద్వారా మూత్రాశయ వ్యాధులను నయం చేస్తుంది.

పిండి కూర మొక్కను వేర్లతో సహా బాగా కడికి దానిని తురిమి అర లీటరు నీటిలో మరగబెట్టాలి. అలా దీనిలో సగం వరకు ఆవిరైపోయే వరకూ మరిగించాలి. అప్పుడు దీనిని దించి వడబోసుకోవాలి. దీనికి పటిక బెల్లం ఒక 30 గ్రాములు, శిలాజిత్ పొడి ఒక 2 గ్రాములు కలుపుకోవాలి. ఇలా ప్రతిరోజూ పరగడపున ఖాళీకడుపుతో దీనిని తాగాలి.

పిండి కూర మొక్కలు వేర్లతో సహా తెచ్చి బాగా కడిగి మెత్తగా దంచాలి. ఒక ముద్దలాగా చేసి ఒక గుడ్డలో వేసి పిండితే రసం వస్తుంది. సమపాళ్లలో పటిక బెల్లం కలపాలి. దీనిని సన్నని మంటపై మరిగించాలి. లేతగా పాకం వచ్చే వరకూ మరిగించాలి. ఆ తరువాత చల్లార్చి నిల్వ ఉంచుకోవచ్చు. దీనిని పెద్దలకు రోజుకు ఒకటి రెండు చెంచాలు., పిల్లలకు అర చెంచా చాలు.

ఇవి కూడా చదవండి

ఈ కషాయం తాగిన తరువాత గంట సేపు ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. మూత్రాశయంలో, మూత్ర పిండాల(కిడ్నీ) లో ఉన్న రాళ్లు కరిగి మూత్రం ద్వారా వెళ్లిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పిండి కూర ఆకును కూరగా వండుకొని తినవచ్చు. పప్పులో కూడా వేసుకోవచ్చు. తద్వారా మూత్రపిండాల్లో ఉన్న వ్యర్థాలు మూత్రం ద్వారా వెల్లిపోతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది)