Watch: ఏం చేద్దాం.! టైం లేదు బ్రో..!! రిక్షా పై ఎలా సెట్ చేశావు రా అయ్యా..!
మీరు నిరంతర పని ఒత్తిడితో విసుగెత్తిపోతున్నారా..? అయితే, మీరు ఖచ్చితంగా కనీసం కొంత సమయం సోషల్ మీడియాలో గడపాలి. ఇక్కడ, మిమ్మల్ని నవ్వించే వీడియోలు అనేకం కనిపిస్తాయి. ఏ ఒక్క వీడియో చూసిన కూడా మీ ఒత్తిడి క్షణంలో మాయమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. అదేంటో మీరు చూసి ఎంజాయ్ చేయండి..

వైరల్ వీడియోలో రోడ్డుకు అవతలి వైపున ఒక రిక్షా డ్రైవర్ తన రిక్షా నడుపుతున్నాడు. అయితే, అతను రిక్షా పై నుండి రిక్షా తొక్కడం లేదు, బదులుగా తన చేతులతో లాగుతున్నాడు. ఎందుకంటే మరొక వ్యక్తి అప్పటికే సీటుపై కూర్చుని ఉన్నాడు. వెనుక సీటుపై ఒక మంగలి (క్షురకుడు) కూర్చుని ఉన్నాడు. అయితే, ఈ వీడియో వైరల్ కావడానికి కారణం రిక్షా డ్రైవర్ కాదు, ఆ బార్బర్ ఇంకా ఆ రిక్షా డ్రైవర్ సీటుపై కూర్చున్న వ్యక్తి. ఎందుకంటే.. కదులుతున్న రిక్షాలో బార్బర్ ఆ వ్యక్తి జుట్టు కత్తిరించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వీధిలో ఉన్నవారు, బాటసారులు ఇదంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఈ దృశ్యం చూసిన వారెవరూ నవ్వకుండా ఉండలేకపోతున్నారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో rohit_tm_00 అనే ఖాతా ద్వారా “కామ్ నహి రుకేగా” అనే శీర్షికతో షేర్ చేయబడింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ రిక్షాలో బార్బర్ వర్క్ వీడియో ఇప్పటివరకు 800,000 మందికి పైగా వీక్షించారు. ఈ ఫన్నీ, వైరల్ వీడియో చూసిన తర్వాత ఇంటర్నెట్ వినియోగదారులు స్పందించకుండా ఉండలేకపోతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి…
View this post on Instagram
వీడియో చూసిన ఒక వ్యక్తి .. దీనిని ఒక మొబైల్ హెయిర్ కటింగ్ షాప్‌గా వర్ణించాడు. మరొవ్యక్తి స్పందిస్తూ..మొత్తం మార్కెట్ భయపడుతోందని, ఏదో ఒకరోజు ఇతను అందరి దుకాణాలు మూసివేస్తాడని చెబుతుండగా, చాలా మంది ఇదే విషయం ప్రస్తవించారు.. బ్రదర్ నిజంగానే అందరు క్షురకులు భయపడుతున్నారని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




