అరెరె.. పెద్ద సమస్యే వచ్చిపడిందే..! ఇప్పుడు డ్యాన్స్ చేయాలా.. వద్దా..? వరుడి కన్‌ప్యూజన్!
దేశవ్యాప్తంగా వెడ్డింగ్ సీజన్ మొదలైంది. దానికి ముందు, సోషల్ మీడియాలో మరోసారి ఫన్నీ వెడ్డింగ్ వీడియోలు ట్రెండ్ కావడం ప్రారంభించాయి. అలాంటిదే ఒక వీడియో నెటిజన్ల దృష్టిని తెగ ఆకర్షించింది. ఇందులో ఒక వరుడుని వధువుతోపాటు అతని మరదళ్లు డాన్స్ చేయించడానికి పదే పదే ప్రయత్నించి విఫలమయ్యారు.

దేశవ్యాప్తంగా వెడ్డింగ్ సీజన్ మొదలైంది. దానికి ముందు, సోషల్ మీడియాలో మరోసారి ఫన్నీ వెడ్డింగ్ వీడియోలు ట్రెండ్ కావడం ప్రారంభించాయి. అలాంటిదే ఒక వీడియో నెటిజన్ల దృష్టిని తెగ ఆకర్షించింది. ఇందులో ఒక వరుడుని వధువుతోపాటు అతని మరదళ్లు డాన్స్ చేయించడానికి పదే పదే ప్రయత్నించి విఫలమయ్యారు. డ్యాన్స్ ఫ్లోర్‌లో “జోరు కా గులామ్”గా మారడానికి వరుడు నిరాకరించాడు.
ఈ వైరల్ వీడియోలో, వధూవరులు డ్యాన్స్ ఫ్లోర్‌లో ఉన్నారు. ఆపై వధువు ఆమె అల్లరి సోదరీమణులు బాలీవుడ్ నటుడు గోవింద నటించిన ప్రసిద్ధ పాట ‘మై జోరు కా గులాం బంకే రహుంగా’ ను ప్లే చేశారు. ఆ పాటకు అందరూ ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. పాట ప్రారంభమైన వెంటనే, వధువు కూడా ఉత్సాహంగా డాన్స్ చేయడం ప్రారంభించింది. తన భాగస్వామిని కూడా నృత్యం చేయమని బలవంతం చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అయితే, వరుడి ప్రతిచర్యగా చూడటం తప్పా అడుగు కదపలేదు. అతను తన చేతులను ప్యాంటు జేబుల్లో వేసుకుని నిలబడి నవ్వుతూ ఉండిపోయాడు.
ఈ వీడియోలో, అక్కడున్న కొంటె మరదళ్లు పదే పదే కోరినప్పటికీ, వరుడు ఒక్క అంగుళం కూడా కదలలేదు. అతన్ని చూస్తే, “పుష్ప” శైలిలో, “కదిలేదీ లేదు!” అని చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఫన్నీ వీడియోను @ankit_shah_256 అనే ఖాతా ద్వారా Instagram లో షేర్ చేశారు. దీనిని 2.8 మిలియన్లకు పైగా వీక్షించారు. 23,000 మందికి పైగా లైక్ చేశారు. కామెంట్స్ విభాగంలో అనేక వినోదాత్మక ప్రతిస్పందనలు అందించారు.
ఒక యూజర్ “అతను పుష్పరాజ్, అతను చలించడు” అని వ్యాఖ్యానించారు. మరొక యూజర్ “సోదరి, మీకు అర్థం కాలేదు. ఎదీ పని చేయదు” అని అన్నారు. మరొక యూజర్ వరుడిని ప్రశంసిస్తూ, “మొత్తం పురుష సమాజం నిన్ను చూసి గర్విస్తోంది, సోదరా” అని అని పేర్కొన్నారు.
వీడియోను ఇక్కడ చూడండిః
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
