AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ వీడి ప్రేమ సల్లగుండా..! భార్యపై ప్రేమతో కుక్కగా మారిన భర్త.. అసలు సంగతి ఏంటంటే..

ఒక మగవాడు తాను ప్రేమించిన మహిళ కోసం ఏదైనా చేస్తాడని అంటారు. సమాజంలో చాలా మందిలో దీనికి రుజువులు కనిపిస్తాయి. పురుషులు తమ భార్యలను లేదా ప్రియురాలిని సంతోషపెట్టడానికి ఖరీదైన బహుమతులు ఇస్తారు. కానీ, ఒక వ్యక్తి అన్ని పరిమితులను దాటాడు. తన భార్యను సంతోషపెట్టడానికి అతను కుక్కగా మారాడు..! ఏంటి షాక్‌ అవుతున్నారా..? భార్యకు ప్రేమతో అతడు ఏం చేశాడంటే..

వార్నీ వీడి ప్రేమ సల్లగుండా..! భార్యపై ప్రేమతో కుక్కగా మారిన భర్త.. అసలు సంగతి ఏంటంటే..
Man Become Dog
Jyothi Gadda
|

Updated on: Oct 08, 2025 | 5:23 PM

Share

సినిమాల్లో నటులు వేర్వేరు పాత్రలు పోషిస్తారు. కానీ, నిజ జీవితంలో ఒక వ్యక్తి మరో ఇతర పాత్ర పోషించాడు. ఈ వ్యక్తి కుక్కలా తిరగడం ప్రారంభించాడు. అతను కుక్కలా జీవించడానికి ఇష్టపడతాడు. అతని కథ పాతదే అయినప్పటికీ, అది ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈసారి, తన పెంపుడు కుక్క మరణం తర్వాత షాక్‌లో ఉన్న తన కాబోయే భార్యను ఉత్సాహపరిచేందుకు అతను కుక్క రూపాన్ని ధరించాడు. కారణం ఏమైనప్పటికీ ఒక మనిషి కుక్కగా మారడం చాలా వింతగా ఉంది.

ఒక పురుషుడు తాను ప్రేమించిన స్త్రీ కోసం ఏదైనా చేస్తాడని అంటారు. సమాజంలో చాలా మందిలో దీనికి రుజువు కనిపిస్తుంది. తమ భార్యలను లేదా ప్రియురాలిని సంతోషపెట్టడానికి మగవాళ్లు వారికి ఖరీదైన బహుమతులు ఇస్తారు. వారి ప్రతి కోరికను అంగీకరిస్తారు. వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. వారి గౌరవానికి ఎక్కడ లోటు రాకుండా చూస్తారు. కానీ, ఒక వ్యక్తి అన్ని పరిమితులను దాటాడు. తన భార్యను సంతోషపెట్టడానికి అతను కుక్కగా రూపాంతరం చెందాడు..! ఆశ్చర్యపోనవసరం లేదు, అతను నిజంగా కుక్కగా మారలేదు. కానీ, తన భార్య పెంపుడు కుక్క చనిపోయి ఆమెను తీవ్ర షాక్‌కు గురిచేసింది. తిరిగి ఆమెను మామూలు స్థితికి తీసుకురావడం కోసం తానే కుక్క రూపాన్ని ధరించాడు..

ఇవి కూడా చదవండి

@insidehistory అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆసక్తికరమైన విషయాలు, వింత విషయాలను షేర్‌ చేశారు.. అలాంటి ఒక షాకింగ్ వార్త ఇటీవల బయటపడింది. వైరల్‌గా మారిన ఫోటోలో డాల్మేషియన్ కుక్కలా దుస్తులు ధరించిన వ్యక్తి ఉన్నాడు. అతను ముసుగు కూడా ధరించాడు. ఆ ఫోటోతో పాటు ఉన్న క్యాప్షన్ ఇలా ఉంది. తన భార్య ప్రియమైన డాల్మేషియన్ కుక్క మరణం తర్వాత, 32 ఏళ్ల టామ్ పీటర్స్ తనను తాను ఆ కుక్కలాగా మార్చుకోవాలని అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. పీటర్స్ కి ఇది కేవలం అనుకరణ కాదు.. ఇది అతనికి చాలా ఆనందాన్ని తెచ్చిపెట్టిన పెంపుడు జంతువుకు నివాళి అని చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..