AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొప్పాయి గింజలను పడేస్తున్నారా..? ఇది తెలిస్తే అస్సలు వదలరు..

బొప్పాయి పండుతో పాటు దాని విత్తనాల్లో కూడా ఎన్నో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు తోడ్పడటం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం, శరీరంలోని వాపులను తగ్గించడం, కాలేయం, పేగుల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం వంటి ప్రయోజనాలను అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని పరిమిత మోతాదులోనే తీసుకోవడం మంచిది. బొప్పాయి విత్తనాలను పొడి చేసి మజ్జిగ, సలాడ్ లేదా పండ్ల రసంలో కలిపి తీసుకోవచ్చు.

బొప్పాయి గింజలను పడేస్తున్నారా..? ఇది తెలిస్తే అస్సలు వదలరు..
Papaya Seeds Benefits
Shaik Madar Saheb
|

Updated on: Jul 20, 2026 | 1:03 PM

Share

బొప్పాయి పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసిందే.. ఎన్నో పోషకాలున్న బొప్పాయి.. జీర్ణవ్యవస్థకు, దంత సమస్యలకు, రక్త సరఫరాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, చాలామంది పడేసే బొప్పాయి విత్తనాలలోనూ అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వీటిని నిర్భయంగా తినవచ్చని, ముఖ్యంగా పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. బొప్పాయి గింజలు పోషకాల నిధి. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గించడంతోపాటు.. పేగుల్లోని క్రిములను నాశనం చేయడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు.

బొప్పాయి విత్తనాల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు:

వ్యాధి నిరోధక శక్తి: బొప్పాయి విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించి, జ్వరం, జలుబు, దగ్గు వంటి ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడతాయి.

జీర్ణక్రియ మెరుగుదల: బొప్పాయి విత్తనాలు జీర్ణవ్యవస్థకు అత్యంత ప్రయోజనకరం. ఇవి జీర్ణాశయంలో ఉండే క్రిములను నాశనం చేసి, ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. కడుపులో ఉండే పలు రకాల పురుగులను నశింపజేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

ఇవి కూడా చదవండి

విష పదార్థాల నిర్మూలన: ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున బొప్పాయి విత్తనాలను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రపడి, అవయవాల్లోని వ్యర్థాలు తొలగింపబడతాయి.

బరువు నియంత్రణ: బొప్పాయి విత్తనాలలో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి శరీర మెటబాలిజం రేటును పెంచి, త్వరగా బరువు తగ్గేందుకు దోహదపడతాయి.

క్యాన్సర్ నివారణ: ఓ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం.. బొప్పాయి విత్తనాలు క్యాన్సర్ కణాలు, ట్యూమర్ల వృద్ధిని అడ్డుకుంటాయి. పలు క్యాన్సర్లను నివారించే శక్తి వీటికి ఉంది. కడుపు, పేగుల్లో వృద్ధి చెందే హానికర బ్యాక్టీరియాలను ఇవి నిర్మూలిస్తాయి.

మధుమేహం, గుండె జబ్బుల నియంత్రణ: బొప్పాయి విత్తనాలు మధుమేహం, గుండె జబ్బుల వంటి ప్రమాదకర వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని ఔషధ గుణాలు ఈ వ్యాధుల తీవ్రతను తగ్గిస్తాయి.

కాలేయం, కిడ్నీ ఆరోగ్యం: రోజు ఓ స్పూన్ బొప్పాయి విత్తనాలను తీసుకోవడం వల్ల కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులు దరిచేరవని హామీ ఇస్తున్నారు. నెల రోజుల పాటు 5 లేదా 6 విత్తనాలను పండ్ల రసం లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది.

కండరాల దృఢత్వం: బొప్పాయి విత్తనాలు కండరాలను దృఢంగా మార్చడంలో సహాయపడతాయి. మనం తినే ప్రోటీన్లు సక్రమంగా వినియోగపడి, కండరాల సమస్యలు తొలగిపోయి, కండరాలు చక్కగా నిర్మాణం అవుతాయి.

నొప్పి నివారణ, వాపుల తగ్గింపు: బొప్పాయి విత్తనాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి.

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు: బొప్పాయి విత్తనాలకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ధర్మాలు ఉన్నాయి. ఇవి E. coli వంటి బ్యాక్టీరియాలను నిర్మూలించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.

పురుషుల సంతానోత్పత్తి: బొప్పాయి విత్తనాలు పురుషులలో వీర్య నాణ్యతను పెంచి, శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి.

ఎలా తీసుకోవాలి?

ఎవరైనా రోజుకు రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో బొప్పాయి విత్తనాలను తీసుకోవచ్చు. నేరుగా తినలేనివారు వాటిని పొడి చేసుకొని మజ్జిగ లేదా సలాడ్లలో కలుపుకొని తినవచ్చు. 5 లేదా 6 బొప్పాయి విత్తనాలను నలిపి ఏదైనా పండ్ల రసం లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవడం కూడా ప్రయోజనకరమే..

గమనిక: బొప్పాయి విత్తనాలపై కొన్ని ప్రయోగశాల, జంతు అధ్యయనాలు ఆశాజనక ఫలితాలు చూపించినప్పటికీ, క్యాన్సర్ నివారణ, డెంగ్యూ లేదా టైఫాయిడ్‌ను అడ్డుకోవడం, పురుషుల సంతానోత్పత్తిని పెంచడం వంటి ప్రయోజనాలకు బలమైన మానవ ఆధారాలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు లేదా కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అధిక మోతాదులో తీసుకోవడం కూడా నివారించాలి.

Follow Us