AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise Movie: థియేటర్లలో ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించిన పాట.. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా ’ ది ప్యారడైజ్‌'. సెప్టెంబర్‌ 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా మరో మూడు రోజుల్లో ఓటీటీలోకి రానుంది

The Paradise Movie: థియేటర్లలో ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించిన పాట.. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
The Paradise Movie
Basha Shek
|

Updated on: Oct 19, 2026 | 2:09 PM

Share

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా ’ ది ప్యారడైజ్‌’. సెప్టెంబర్‌ 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా సినీ అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. అయితే కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు సుమారు రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు టాక్. కాగా థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ది ప్యారడైజ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 22 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ది ప్యారడైజ్ లోని పాటలు కూడా ఛార్డ్ బస్టర్స్ గా నిలిచాయి. అనిరుధ్ స్వరపరిచిన పాటలన్నీ శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా నాని, కీర్తి సురేశ్ కలిసి చేసిన ఐటమ్ సాంగ్ ‘యేషనాగుల కట్టమీద’ అయితే సోషల్ మీడియాను షేక్ చేసింది. యూట్యూబ్ లో ఈ పాటకు రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇక థియేటర్లలో అయితే ఈ ఫోక్ సాంగ్ కు విజిల్స పడ్డాయి. చాలా మంది సినిమా సెలబ్రిటీలు కూడా ఈ పాటను రీక్రియేట్ చేశారు. తమదైన శైలిలో డ్యాన్స్ లు వేసి ఇన్ స్టా రీల్స్, వీడియోలు చేశారు. ఇప్పుడీ ‘యేషనాగుల కట్టమీద’ ఫుల్ వీడియో సాంగ్‌ని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.

కాగా తెలంగాణ సంస్కృతి, జానపదం ప్రతిబింబించేలా ‘యేష నాగుల కట్టమీద’ పాటను రూపొందించారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా… జంగి రెడ్డి, ప్రభ ఎంతో అద్బుతంగా ఈ పాటను పాడారు. ఇక అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అయితే నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. అలాగే నాని, కీర్తి సురేష్ ల మాస్ స్టెప్పులు కూడా ఆడియెన్స్ ను అలరించాయి.

ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు శికంజా మాలిక్ అనే కరుడుగట్టిన విలన్ పాత్రలో భయపెట్టాడు. అలాగే కిల్ ఫేమ్ రాఘవ్ జుయేల్, సంపూర్ణేష్ బాబు తదితరులు వివిధ పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

‘యేష నాగుల కట్టమీద’ ఫుల్ వీడియో సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
థియేటర్లలో పూనకాలు తెప్పించిన పాట.. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్
థియేటర్లలో పూనకాలు తెప్పించిన పాట.. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టెస్టులో 100 ఏళ్ల అరుదైన రికార్డు..!
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టెస్టులో 100 ఏళ్ల అరుదైన రికార్డు..!
మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు బాగా ఇష్టం
మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు బాగా ఇష్టం
IPL Trade: సీఎస్‌కే కాదు.. హార్దిక్ పాండ్యా చేరేది ఆ జట్టులోనా..?
IPL Trade: సీఎస్‌కే కాదు.. హార్దిక్ పాండ్యా చేరేది ఆ జట్టులోనా..?
AI సహాయంతో 5 ఏళ్ల ముందే రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టొచ్చు
AI సహాయంతో 5 ఏళ్ల ముందే రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టొచ్చు
పోలవరం వద్ద గోదారమ్మకు సరికొత్త శోభ..!
పోలవరం వద్ద గోదారమ్మకు సరికొత్త శోభ..!
'జైలర్ 2' చైల్డ్ ఆర్టిస్ట్‌కు సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందా?
'జైలర్ 2' చైల్డ్ ఆర్టిస్ట్‌కు సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందా?
ఈదురుగాలులు, పిడుగులతో వానలు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ..
ఈదురుగాలులు, పిడుగులతో వానలు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ..
గురు చంద్రుల పరివర్తన.. ఈ రాశుల వారికి అపార ధన లాభం..!
గురు చంద్రుల పరివర్తన.. ఈ రాశుల వారికి అపార ధన లాభం..!
శాంసన్ కాదు.. వైభవ్ సూర్యవంశీకి బదులు ఈ ఆటగాడిని తప్పించండి
శాంసన్ కాదు.. వైభవ్ సూర్యవంశీకి బదులు ఈ ఆటగాడిని తప్పించండి