రజినీకాంత్‌కు జోడీగా 27 ఏళ్ల హీరోయిన్.. భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా
టాలీవుడ్, కోలీవుడ్‌లో హీరోల వయసుతో సంబంధం లేకుండా కథలకు, పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ముఖ్యంగా సీనియర్ హీరోలు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. మరోవైపు కుర్ర హీరోయిన్లు సైతం సీనియర్ హీరోలతో జతకడుతూ సందడి చేస్తున్నారు. అయితే ఒకప్పుడు సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన 27 ఏళ్ల హీరోయిన్ నటించిన సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా?

ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీనియర్ హీరోల హవా కొనసాగుతోంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలు తమదైన శైలిలో సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. వయసు పెరుగుతున్నా స్క్రీన్‌పై తమ ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీరితో పాటు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇక సీనియర్ హీరోల సరసన నటించేందుకు యువ హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హీరోహీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం కనిపించినప్పుడు సోషల్ మీడియాలో చర్చలు, ట్రోల్స్ జరగడం సహజంగా మారింది. గతంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన సికందర్ సినిమా విషయంలోనూ వయసు వ్యత్యాసంపై చర్చ జరిగింది.
నా భర్త మామూలోడు కాదు.. 9మంది అమ్మాయిలను మోసం చేశాడు
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన లింగా. 2014లో విడుదలైన ఈ చిత్రానికి కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేయగా, సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి కథానాయికలుగా నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలైన సమయంలో రజినీకాంత్ వయసు 64 సంవత్సరాలు కాగా, సోనాక్షి సిన్హా వయసు కేవలం 27 సంవత్సరాలు. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 37 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ వీరిద్దరూ తెరపై జంటగా కనిపించడం అప్పట్లో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఇప్పుడు సినిమాలకు దూరం ఇలా ..
రజినీకాంత్‌కు ఉన్న క్రేజ్, భారీ నిర్మాణ విలువలు, స్టార్ క్యాస్ట్‌తో లింగాపై విడుదలకు ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రజినీకాంత్ ద్విపాత్రాభినయం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే సినిమా విడుదలైన తర్వాత కథనం, క్లైమాక్స్ వంటి అంశాలపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే మరోవైపు రజినీకాంత్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తనదైన స్టైల్, మేనరిజమ్స్‌తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆయనకు ఇప్పటికీ భారీ అభిమానగణం ఉంది. వయసుతో సంబంధం లేకుండా కొత్త కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా జైలర్ 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రజినీకాంత్. కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది ఈ మూవీ.
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా: రష్మిక మందన్న
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




