AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా: రష్మిక మందన్న

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి. పెళ్లి తర్వాత విరోష్ జంట నటించిన మొదటి సినిమా కావడంతో మొదటి నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉండడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. అందుకు తగ్గట్టుగానే దసరా కానుకగా 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణబాలి సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా: రష్మిక మందన్న
Vijay Devarakonda,rashmika
Rajeev Rayala
|

Updated on: Oct 18, 2026 | 6:53 PM

Share

టాలీవుడ్‌ స్టార్ కపుల్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒకరు. వీరిద్దరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అభిమానుల్లో ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యంగా వీరి ప్రేమ, పెళ్లి గురించి తెలుసుకోవాలని చాలామంది ఎదురుచూస్తుంటారు. ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట.. తాజాగా రణబాలి సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సెలబ్రిటీ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’లో ఈ జంట తమ బంధానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లి ప్రపోజల్ విషయంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

షోలో భాగంగా హోస్ట్ కరణ్ జోహార్.. మీ ఇద్దరిలో ముందుగా పెళ్లి ప్రపోజ్ చేసింది ఎవరని  ప్రశ్నించాడు. దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ, రష్మికే తనను పెళ్లి చేసుకుందామని అడిగిందని సరదాగా చెప్పాడు. తాను అంగీకారం తెలిపేలోపే ఆమె చాలాసార్లు అడిగి ఉంటుందని అన్నాడు. నేను ఓకే చెప్పేలోగా ఒక వందసార్లు అడిగింది అని సరదాగా అన్నాడు విజయ్.  విజయ్ మాటలకూ నవ్వుకున్న రష్మిక.. తాను ఒక్కరోజో, రెండు రోజులపాటో కాదని, దాదాపు ఏడాది పాటు అతడిని పెళ్లి చేసుకుందామని అడుగుతూనే ఉన్నానని చెప్పుకొచ్చింది. దీంతో కరణ్ జోహార్ ఆశ్చర్యపోగా, విజయ్ మాత్రం తానేమీ అంత చెడ్డవాడిని కాదంటూ సరదాగా స్పందించాడు. ఆ మాటలతో షోలో నవ్వులు విరిశాయి. తమ బంధంలోని చిలిపి క్షణాలను ఈ జంట ఇలా పంచుకోవడం అభిమానులకు ఆసక్తికరంగా మారింది.

అలాగే షోలోని ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లోనూ రష్మిక తన సమాధానాలతో ఆకట్టుకుంది. ‘పుష్ప’ సినిమాలో తనతో కలిసి నటించిన అల్లు అర్జున్, ‘యానిమల్’ చిత్రంలో సహనటుడిగా ఉన్న రణ్‌బీర్ కపూర్‌లలో ఎవరిని ఎంచుకుంటారని కరణ్ ప్రశ్నించగా.. రష్మిక వెంటనే అల్లు అర్జున్ పేరును చెప్పింది. అదే సమయంలో రష్మికతో కాకుండా మరే ఇతర నటితో విజయ్ దేవరకొండ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని అడిగిన ప్రశ్నకు రష్మిక ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తి రేకెత్తించింది. విజయ్‌కు మరో హీరోయిన్‌తో కెమిస్ట్రీ లేదన్నట్లుగా ఆమె బదులివ్వడంతో షోలో నవ్వులు పూశాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి విజయ్ దేవరకొండ తనదైన శైలిలో మాట్లాడాడు. సంతోషకరమైన వైవాహిక జీవితానికి తన దగ్గర ఒకటే సూత్రం ఉందని, భార్య చెప్పిన మాటకు ఎప్పుడూ ఓకే చెప్పాలని సరదాగా అన్నాడు విజయ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..
ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్
ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్