AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు చాలా ఇష్టం: సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులుఉండరూ.. ఆయన ఈ లోకాన్ని విడిచిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆయన అభిమానులు కృష్ణ గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు.

మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు చాలా ఇష్టం: సూపర్ స్టార్ కృష్ణ
Krishna
Rajeev Rayala
|

Updated on: Oct 19, 2026 | 2:04 PM

Share

తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణది ప్రత్యేకమైన స్థానం. విభిన్న కథలను ఎంచుకుంటూ, సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమాకు సాంకేతికంగా కొత్త హంగులు పరిచయం చేయడంలోనూ తనదైన ముద్ర వేశారు. కృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సినిమాలు, జ్ఞాపకాలు అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ఈ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, తనకు ఇష్టమైన హీరోయిన్లు, కుమారుడు మహేష్ బాబు, ప్రస్తుత తరం హీరోలతో పాటు తనకు లభించిన పురస్కారాల గురించి ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నా భర్త మామూలోడు కాదు.. 9మంది అమ్మాయిలను మోసం చేశాడు

కృష్ణ తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన కథల్లో నటించారు. ముఖ్యంగా జేమ్స్ బాండ్ తరహా కథాంశంతో తెరకెక్కిన ‘గూఢచారి 116’ ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ఒకటి. ఇదే సినిమాను తన కుమారుడు మహేష్ బాబుతో రీమేక్ చేయాల్సి వస్తే చేస్తా అని కృష్ణ గతంలో అన్నారు. అలాగే తన సినీ ప్రయాణంలో ఎంతోమంది ప్రముఖ హీరోయిన్లతో కలిసి నటించారు కృష్ణ. వారిలో జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధ, శ్రీదేవి తనకు ఇష్టమైన హీరోయిన్లని ఆయన పేర్కొన్నారు.  అప్పట్లో ఈ నటీమణులతో కలిసి కృష్ణ ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఇప్పుడు సినిమాలకు దూరం ఇలా ..

ప్రస్తుత తరం హీరోల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మహేష్ బాబు కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తనకు నచ్చిన హీరో అని కృష్ణ చెప్పారు.  సూపర్ స్టార్ కృష్ణ తనకు జూనియర్ ఎన్టీఆర్ నచ్చిన హీరోల్లో ఒకరని చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే తనకు ఉన్న సూపర్ స్టార్ ఇమేజ్, మహేష్ బాబుకు తండ్రిగా లభించిన గుర్తింపు.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఇష్టమని ప్రశ్నించగా, రెండూ తనకు ఇష్టమేనని కృష్ణ సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి

ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా: రష్మిక మందన్న

Ntr

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us