AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

22 మందిలో 19 మంది వాళ్లే.. దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా టెస్టులో 100 ఏళ్ల అరుదైన రికార్డు..!

100 Year Cricket Record: టీ20 క్రికెట్‌లో యువ ఆటగాళ్ల దూకుడు కొనసాగుతున్న సమయంలో టెస్ట్ క్రికెట్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో 22 మంది ఆటగాళ్లలో ఏకంగా 19 మంది 30 ఏళ్లు దాటినవారే. దీంతో 100 ఏళ్ల నాటి అరుదైన రికార్డు మరోసారి తెరపైకి వచ్చింది.

22 మందిలో 19 మంది వాళ్లే.. దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా టెస్టులో 100 ఏళ్ల అరుదైన రికార్డు..!
South Africa Vs Australia Test
Venkata Chari
|

Updated on: Oct 19, 2026 | 1:59 PM

Share

South Africa vs Australia Test: “వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే” అనే మాటకు క్రికెట్‌లో మరోసారి బలమైన ఉదాహరణ కనిపించింది. దక్షిణాఫ్రికా (South Africa), ఆస్ట్రేలియా (Australia) మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ అరుదైన రికార్డుకు వేదికగా నిలిచింది. ప్రస్తుతం క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌ ప్రభావం పెరిగింది. యువ ఆటగాళ్ల వేగం, భారీ షాట్లు, దూకుడైన ఆటకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. అయితే కెబెర్హాలో జరిగిన రెండో టెస్టు మాత్రం అనుభవానికి కూడా క్రికెట్‌లో ఎంత విలువ ఉందో చూపించింది.

ఈ మ్యాచ్‌లో రెండు జట్ల తుది జట్లలో కలిపి మొత్తం 22 మంది ఆటగాళ్లు బరిలోకి దిగారు. వీరిలో ఏకంగా 19 మంది ఆటగాళ్లు 30 ఏళ్లు దాటినవారే కావడం విశేషం. ఆస్ట్రేలియా జట్టులో 30 ఏళ్లు దాటిన 11 మంది ఆటగాళ్లు ఉండగా, దక్షిణాఫ్రికా తుది జట్టులో 8 మంది 30 ఏళ్లు దాటిన ఆటగాళ్లు ఉన్నారు. ఇలా ఒకే టెస్టు మ్యాచ్‌లో 30 ఏళ్లు దాటిన 19 మంది ఆటగాళ్లు బరిలోకి దిగడం గత 100 ఏళ్లలో ఇదే తొలిసారి.

1926లో చివరిసారి..

ఇంతకు ముందు 1926లో ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా మధ్య జరిగిన మాంచెస్టర్ టెస్టులో కూడా 30 ఏళ్లు దాటిన 19 మంది ఆటగాళ్లు మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత దాదాపు ఒక శతాబ్దం పాటు ఏ టెస్టు మ్యాచ్‌లోనూ ఇంత పెద్ద సంఖ్యలో 30 ఏళ్లు దాటిన ఆటగాళ్లు ఒకేసారి బరిలోకి దిగలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అదే సంఖ్యలో సీనియర్ ఆటగాళ్లతో మైదానంలోకి రావడంతో 100 ఏళ్ల నాటి రికార్డు మళ్లీ చర్చలోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు.. ప్రపంచ రికార్డ్ నే షేక్ చేసిన టీమిండియా నయా సెన్సేషన్..!

అనుభవానికీ ప్రత్యేక స్థానం..

ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో యువ ఆటగాళ్ల దూకుడుకు పెద్దపీట వేస్తున్నారు. సిక్సర్లు, ఫోర్లు, వేగంగా పరుగులు సాధించడం ప్రధానంగా మారింది. అయితే టెస్ట్ క్రికెట్‌లో అనుభవం, ఓర్పు, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే సామర్థ్యం ఇప్పటికీ కీలకమే.

దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా రెండో టెస్టులో కనిపించిన ఈ 19 మంది సీనియర్ ఆటగాళ్ల సమూహం అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. వయసు పెరిగినా మైదానంలో పోరాడే సామర్థ్యం, ఒత్తిడిని ఎదుర్కొనే అనుభవం, మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకునే నైపుణ్యం టెస్ట్ క్రికెట్‌లో ఎంతో విలువైనవని ఈ మ్యాచ్ చాటిచెప్పింది.

ఎక్కువమంది చదివినది: జస్ట్ 6 బంతుల్లో 400 స్ట్రైక్ రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. యూవీ 19 ఏళ్ల రికార్డ్ బ్రేక్..

సుమారు శతాబ్దం తర్వాత ఒకే టెస్టులో ఇంతమంది సీనియర్ ఆటగాళ్లు కనిపించడం క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది. యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులకు కూడా క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉందని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us