Karachi Halwa: పేరులో పాకిస్తాన్.. రుచిలో హిందూస్తాన్.. కరాచీ హల్వా మన దేశంలో ఎలా అడుగు పెట్టిందో తెలుసా..
భారతదేశంలో స్వీట్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ప్రతి సంతోషకరమైన సందర్భంలోనూ స్వీట్లు తింటారు. పాకిస్తాన్, భారతదేశం మధ్య యుద్ధం లాంటి పరిస్థితి ఉన్న ఈ సమయంలో ఒక స్వీట్ చాలా వైరల్ అవుతోంది. ఈ స్వీట్ పేరు కరాచీ హల్వా. కరాచీ హల్వాకు భారతదేశంతో ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకుందాం.

భారతదేశంలో స్వీట్లకు ప్రత్యేక స్థానం ఉంది. రకరకాల స్వీట్స్ ఉన్నాయి. ఎటువంటి సందర్భంలోనైనా స్వీట్స్ కు ప్రత్యెక స్థానం ఉంది. కొంతమందికి ఆహారం తిన్న తర్వాత కూడా స్వీట్లు తినాలని కోరుకుంటారు. పండగలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వాటి సందర్భాల్లో ఇళ్లలో స్వీట్లు తప్పనిసరి. మన దేశంలో ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం దాని సొంత ప్రత్యేకమైన స్వీట్లను కలిగి ఉంది. ఈ స్వీట్స్ భిన్నమైన రుచితో పాటు వాటి వెనుక కొన్ని ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక తీపి వంటకం కరాచీ హల్వా. ఆ పేరు వినగానే ప్రజల మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఏమిటంటే.. ఈ స్వీట్ పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి వచ్చిందా అని…
అవును.. ఈ స్వీట్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చింది. కరాచీ హల్వా చరిత్ర ఎంత ఆసక్తికరంగా ఉంటుందో.. భారతదేశంతో దాని సంబంధం కూడా అంతే ప్రత్యేకమైనది. ఈ స్వీట్ రంగు రంగులుగా జెల్లీలా ఉంటుంది. అంతేకాదు ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రోజు మనం కరాచీ హల్వా అంటే ఏమిటి? దాని చరిత్ర ఏమిటి? భారతదేశంతో దీని ప్రత్యేక సంబంధం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. దీనితో పాటు.. ఈ కరాచీ హల్వాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే ఎవరైనా సరే ‘వావ్’ అని అంటారు.
కరాచీ హల్వా అంటే ఏమిటి?
కరాచీ హల్వాను మొక్కజొన్న పిండి, చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తారు. దీని ఆకృతి జెల్లీ లా ఉంటుంది. ఇది ఎరుపు, పసుపు , ఆకుపచ్చ రంగులలో తయారవుతుంది. ఈ హల్వా జీవిత కాలం సుదీర్గం అని చెప్పవచ్చు. ఈ స్వీట్‌ను 6 నెలల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు.
భారతదేశంతో కరాచీ హల్వాకు ఎటువంటి సంబంధం అంటే
కరాచీ హల్వా పాకిస్తాన్ సంప్రదాయ తీపి పదార్థం. అయితే భారతదేశంలో కూడా దీనికి ప్రముఖ స్థానం ఉంది. కరాచీ హల్వాను భారతదేశంలో బాంబే హల్వా అని పిలుస్తారు. దీని పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నిజానికి ఈ హల్వాను కరాచీ నగరానికి చెందిన ఆయ కా హల్వాయ్ కుటుంబం భారతదేశానికి తీసుకువచ్చింది. దీనిని నేడు చందు హల్వాయ్ కరాచీ హల్వా అని పిలుస్తారు. దేశ విభజన తర్వాత చందు హల్వాయ్ ఈ హల్వాను ముంబైలో అమ్మడం ప్రారంభించాడు. క్రమంగా ఈ స్వీట్ ముంబై ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. నేడు స్వీట్ స్టాల్స్ లో హల్వా అమ్మకాలు సర్వ సాధారణం.
కరాచీ హల్వా గురించి ఆసక్తికరమైన విషయాలు
- పేరులో పాకిస్తాన్.. కానీ రుచిలో హిందూస్తాన్: ఈ మిఠాయికి కరాచీ పేరు పెట్టి ఉండవచ్చు, కానీ నేడు ఈ స్వీట్ భారతదేశంలోనే అధికంగా తయారు అవుతుంది. ఎక్కువ మంది దీనిని ఇష్టపడుతున్నారు.
- ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది: ఈ స్వీట్ కి మరింత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దీనిని దాదాపు 6 నెలల పాటు నిల్వ చేసి తినవచ్చు. అందుకే ప్రయాణా సమయంలో దీన్ని తీసుకెళ్లడం చాలా సాధారణం.
- కార్న్‌ఫ్లోర్ మ్యాజిక్: హల్వాను సుజీ రవ్వ, శనగ పిండి లేదా గోధుమ పిండి, మైదా పిండితో తయారు చేస్తారు. అయితే ఈ కరాచీ హల్వా తయారీకి కార్న్‌ఫ్లోర్‌ను ఉపయోగిస్తారు.
- కరాచీ హల్వా ఆకృతి: కరాచీ హల్వా ఇతర హల్వాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ హల్వా ఆకృతి జెల్లీ లాంటిది. పారదర్శకంగా ఉంటుంది. అదే సమయంలో దీనిని చదరపు ఆకారంలో కట్ చేస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..