AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel India: వేసవి నుంచి ఉపశమనం కోసం దక్షిణ భారత దేశంలోని ఈ హిల్స్ స్టేషన్స్ బెస్ట్ ఎంపిక..

దక్షిణ భారతదేశంలో వేసవిలో ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు సెలవు దినాలలో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారు. వేడి నుండి ఉపశమనం పొందడంతో పాటు మీ బడ్జెట్‌లోనే ప్రయాణించగల అనేక ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా. ఈ రోజు దక్షిణ భారతదేశంలోని 5 బడ్జెట్ ఫ్రెండ్లీ హిల్ స్టేషన్ల గురించి తెలుసుకుందాం

Surya Kala
|

Updated on: May 09, 2025 | 8:12 PM

Share
వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. దీంతో పిల్లలను విహారయాత్రకు తీసుకెళ్లడానికి ఇదే ఉత్తమ అవకాశమని తల్లిదండ్రులు భావిస్తారు. వేసవి కాలంలో ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి హిమాచల్, కాశ్మీర్ , ఉత్తరాఖండ్ వంటి ప్రదేశాలకు వెళతారు. ఈ ప్రదేశాలు పర్వతాలతో నిండి ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. దీంతో ఇక్కడ వేడి, తేమ నుండి ఉపశమనం లభిస్తుంది, కొన్ని రోజులైనా ప్రశాంతంగా గడపవచ్చని అనుకుంటారు. అయితే దక్షిణ భారతదేశం లో కూడా వేసవి నుంచి ఉపశమనం అందించే అనేక ప్రదేశాలున్నాయి. వేసవిలో పర్యటించడానికి అనుకూలమైన 5 ఉత్తమ ప్రదేశాల గురించి  తెలుసుకుందాం..

1 / 6
మున్నార్: దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్. ఇది పచ్చదనంతో నిండి ఉంటుంది. అందంలో కాశ్మీర్‌ను కూడా మించిపోతుంది. ఇక్కడి తేయాకు తోటలే దీనికి నిజమైన గుర్తింపు. వేసవిలో ఇక్కడి వాతావరణం చల్లగా.. తాజాగా ఉంటుంది. మీరు వెళ్తే తేయాకు తోటలను సందర్శించడంతో పాటు, ఎరవికులం నేషనల్ పార్క్, మట్టుపెట్టి ఆనకట్ట, అట్టుకల్ జలపాతాలను కూడా అన్వేషించవచ్చు.

2 / 6
ఊటీ : ఉదకమండలం అని హిల్ స్టేషన్ల రాణి అని కూడా పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ కూడా చాలా అందంగా.. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం పచ్చదనం, ప్రశాంతతతో మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. చాలా చక్కటి కలపతో చేసిన నివాసాలు డిఫరెంట్ అనుభవాన్ని ఇస్తాయి. వేసవిలో కూడా ఇక్కడ ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. ఇక్కడ సందర్శించాల్సిన ప్రదేశాలు బొటానికల్ గార్డెన్, OT సరస్సు, దొడ్డబెట్ట శిఖరం.

3 / 6
కూర్గ్: ఇక్కడి పచ్చదనం, పర్వతాలు దీనిని స్వర్గంలా అందంగా కనిపించేలా చేస్తాయి. కూర్గ్‌ను స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇక్కడ  కాఫీ తోటలను అన్వేషించవచ్చు. జలపాతాలను కూడా ఆస్వాదించవచ్చు. వేసవిలో సందర్శించడానికి , విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన ప్రదేశం. ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా అబ్బి జలపాతం, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, రాజా సీటు సందర్శించండి.

4 / 6
పొన్ముడి: పొన్ముడి సౌత్‌లోని తక్కువ రద్దీ ఉండే హిల్ స్టేషన్.  స్వచ్ఛమైన గాలిని , పచ్చదనాన్ని ఆస్వాదించగల ప్రదేశం. ఈ ప్రదేశం ట్రెక్కింగ్, వన్యప్రాణులు, ప్రశాంతమైన లోయలకు అనువైనది. ఇక్కడ గోల్డెన్ వ్యాలీ, మినీ జలపాతాలు చూడదగ్గవి.

5 / 6
కున్నూర్: ఇది చాలా ప్రశాంతంగా, తక్కువ రద్దీగా ఉండే హిల్ స్టేషన్. ప్రశాంతమైన క్షణాలు గడపాలనుకుంటే కున్నూర్ ఉత్తమమైనది. ఇక్కడ   టీ తోటలు, లాంగ్ డ్రైవ్‌లు, సహజ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ కేసిమ్స్ పార్క్, డాల్ఫిన్స్ నోస్, లాంబ్స్ రాక్ సందర్శించదగినవి.

6 / 6
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..

చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు

పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...

నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్

ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ

ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..