AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Study Tips: పరీక్షల్లో ఎప్పుడూ అమ్మాయిలే టాపర్స్‌గా ఎందుకు ఉంటారో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే..

ప్రశ్నపత్రం, పరీక్షకు కేటాయించిన సమయం అందరు విద్యార్ధుకలు ఒకేలా ఉన్నప్పటికీ, పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు.. అబ్బాయిల కంటే ఎందుకు ముందంజలో ఉంటున్నారనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అమ్మాయిలు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి, ఫలితాల్లో అబ్బాయిల కంటే మెరుగ్గా రాణించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Study Tips: పరీక్షల్లో ఎప్పుడూ అమ్మాయిలే టాపర్స్‌గా ఎందుకు ఉంటారో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే..
Why Do Girls Top In Exams
Srilakshmi C
|

Updated on: May 09, 2025 | 9:16 PM

Share

పరీక్ష.. ఈ పేరు వినగానే విద్యార్ధులకు ఆకలి, నిద్ర వెంటనే దూరమైపోతాయి. SSLC, PUC పరీక్షలు రాసిన చాలా మంది విద్యార్థుల అనుభవం ఇలాగే ఉంటుంది. ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన బాలుర శాతం కంటే బాలికల శాతం అధికంగా ఉంది.నిజానికి, ఈ ఒక్క ఏడాదే కాదు.. ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మాయిలు మంచి ఫలితాలతో అబ్బాయిలను అధిగమించడం గమనార్హం. దీనిని బట్టి చూస్తుంటే.. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ ప్రిపేర్ అయి మెరుగైన మార్కులు సాధించడంలో విజయం సాధిస్తున్నారనేది కాదనలేని సత్యం.

ప్రశ్నపత్రం, పరీక్షకు కేటాయించిన సమయం అందరు విద్యార్ధుకలు ఒకేలా ఉన్నప్పటికీ, పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు.. అబ్బాయిల కంటే ఎందుకు ముందంజలో ఉంటున్నారనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అమ్మాయిలు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి, ఫలితాల్లో అబ్బాయిల కంటే మెరుగ్గా రాణించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అమ్మాయిలు అబ్బాయిల కంటే బాగా చదువుతారు. వారు ఎక్కువ సమయం చదువుకే కేటాయిస్తారు. ముఖ్యంగా పరీక్షల సమయం సమీపిస్తున్న కొద్దీ వారి పూర్తి దృష్టి చదువుపైనే ఉంటుంది. అమ్మాయిలు తక్కువ మార్కులు వస్తే లేదా ఫెయిల్ అయితే ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అని ఆందోళన చెందుతారు. బాగా చదువుకుని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకే అమ్మాయిలు ఎంత కష్టం వచ్చినా కష్టపడి చదివి, మంచి మార్కులు తెచ్చుకుని పరీక్షల్లో రాణిస్తారు. మరోవైపు తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా భావిస్తారట. స్కోరు తక్కువగా ఉంటే, తమ తల్లిదండ్రులు కూడా అందరూ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ కారణాలన్నింటి వల్ల చదువులో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందుంటున్నారు. దీనిని బట్టి చూస్తే అమ్మాయిల ఆలోచన ధోరణి కారణంగానే వారు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి దోహదం చేస్తుందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్