Optical Illusion: ఈ చిత్రంలో దాగున్న పాండాలు ఎన్నో చెబితే.. మీ చూపు అర్జునుడి వంటిదే..
సోషల్ మీడియాలో చూపుని, మెదడును సవాలు చేసే ఆసక్తికరమైన ఆప్టికల్ భ్రాంతి చిత్రాలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని పరిష్కరించడంలో చాలా సరదాగా ఉంటుంది. అయితే ఇలాంటి పజిల్ గేమ్‌లను పరిష్కరించడానికి మీ తెలివితేటలను ఉపయోగించాలి. ఇప్పుడు అలాంటి ఒక క్లిష్టమైన ఛాలెంజింగ్ చిత్రం వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఎన్ని పాండాలు దాగి ఉన్నాయో కనిపెట్టాలి.

ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి భ్రమగా కనిపించే చిక్కు ప్రశ్నలు. ఈ పజిల్స్ ని అందరూ పరిష్కరించలేరు. చాలా మంది ఇలాంటి పజిల్స్ ని పరిష్కరించడంలో విఫలమవుతారు. అయితే ఈ చిత్రాలు మీకు ఎంత దృష్టి , ఆలోచనా సామర్థ్యం ఉందో సులభంగా చూపించగలవు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం సరళంగా కనిపిస్తుంది కానీ గమ్మత్తైనది. AI సృష్టించిన ఆప్టికల్ ఇల్యూషన్ ఫారెస్ట్ చిత్రంలో పాండాలు దాక్కున్నాయి. మొత్తం ఎన్ని పాండాలు ఉన్నాయో కనుక్కోమంటూ సవాలు విసిరారు. మీరు ఈ పజిల్ ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటే వెంటనే ఈ చిత్రాన్ని చూడండి.
ఈ చిత్రంలో ఏముంది? ఈ చిత్రాన్ని చేతితో గీసిన శైలిలో రూపొందించారు. అడవి మధ్యలో ప్రశాంతంగా కూర్చున్న ఒక పెద్ద పాండా ఎవరికైనా కనిపిస్తుంది. మొదటి చూపులో ఈ చిత్రం ప్రకృతి సాధారణ చిత్రంలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ పాండా ముఖాలు చాలా ఉన్నాయి. చెట్లు, పొదలు , రాళ్ల నేపథ్యంలో అనేక పాండాలు దాగి ఉన్నాయి. ఈ చిత్రంలో వాస్తవానికి ఎన్ని పాండాలు ఉన్నాయో లెక్కించండి. అన్ని పాండాలను గుర్తించడానికి ఓపికగా ఉండటం, చిత్రంలోని ప్రతి మూలను పదునైన దృష్టితో పరిశీలించడం చాలా ముఖ్యం
మీరు ఎన్ని పాండాలను చూశారు? ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రంలో ఒక రహస్యమైన అంశం ఉంటుంది. సాధకులు సహనంగా దృష్టిని కేంద్రీకరించి, అక్కడ ఎన్ని పాండాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఎంత శోధించినా చిత్రంలో దాగి ఉన్న పాండాలు మీకు కనిపించడం లేదని అయోమయంలో పడేస్తుంది ఈ చిత్రం. ఇక్కడ ఎన్ని పాండాలు దాగి ఉన్నాయో మీరు ఖచ్చితంగా చెప్పగలిగితే.. మీ పరిశీన శక్తి అమోఘం.. మీకు డేగ కన్ను ఉందని అర్థం. మీరు ఖచ్చితమైన సమాధానం కనుగొనలేకపోతే.. మొత్తం ఎన్ని పాండాలు ఉన్నాయో మేము మీకు చెప్తాము. ఈ చిత్రంలో మొత్తం పాండాల సంఖ్య 16. చిత్రాన్ని చూసి సమాధానం సరైనదో కాదో చూడటానికి జాగ్రత్తగా లెక్కించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








