మోదుగ పూలతో మెరిసే అందం.. పండగపూట మీ ముఖంలో మరింత మెరుపు..!
పండగ వేళ అందంగా కనిపించాలని అందరూ కోరుకుటారు. ఇందుకోసం మార్కెట్‌లో లభించే ఖరీదైన రసాయన ఉత్పత్తులను చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. అయితే, ఇవి చర్మంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. కాబట్టి, సహజ చర్మ సంరక్షణను పాటించడం ఎల్లప్పుడూ మంచిది. అలాంటి వారికి మోదుగ పూలు అద్భుతంగా పనిచేస్తాయి. వాటి ప్రయోజనాలను ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించారు.

అందమైన ముఖం, మెరిసే చర్మానికి మోదుగ పూలు అద్భుతంగా పనిచేస్తాయి. వాటి ప్రయోజనాలను ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించారు. ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉన్నఈ పువ్వులు మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడతాయి. మోదుగ పువ్వు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి..? ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం..
మోదుగ పూలు ఒక రకమైన సువాస కలిగి ఉంటాయి. ఎరుపు రంగులో కనిపించే ఈ పూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంతేకాదు మోదుగ పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులకు మందుగా పనిచేస్తాయి. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. అలాంటి మోదుగ పూలు చర్మ సంరక్షణలో కూడా మేలు చేస్తాయి. మోదుగ పువ్వులను ఉపయోగించి ఫేస్ ప్యాక్ ఎలా తయారో తెలుసుకుందాం..
మోదుగ పువ్వులతో ఫేస్‌ప్యాక్ తయారీ:
దీని కోసం ముందుగా మోదుగ పూల పొడిని తయారు చేసుకోవాలి.. పూలను బాగా కడిగి, ఎండలో ఆరబెట్టి, ఆపై వాటిని పొడిగా రుబ్బుకోవాలి. తరువాత, ఒక గిన్నెలో 1 టీస్పూన్ మోదుగ పూల పొడి, 2 టీస్పూన్ల ముల్తానీ మిట్టితో కలపండి. తరువాత, రోజ్ వాటర్ వేసి బాగా కలిపి పేస్ట్ లా చేయండి. కావాలనుకుంటే, మీరు తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది పొడి చర్మం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
దీన్ని ఎలా అప్లై చేయాలి:
ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేయండి. దీన్ని అప్లై చేయడానికి, మొదట మీ ముఖాన్ని నీటితో బాగా కడగాలి. తర్వాత ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయండి. 15 నుండి 20 నిమిషాలు పూర్తిగా ఆరనివ్వాలి. అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీని తర్వాత, మీ ముఖానికి మాయిశ్చరైజర్ రాయండి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించడం వల్ల మీ చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చర్మ సంరక్షణ కోసం మోదుగ పువ్వుల ప్రయోజనాలు:
మోదుగ పువ్వులు ముఖం నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడే సహజ లక్షణాలను కలిగి ఉంటాయి. మొటిమలు, మచ్చల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పువ్వు చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో ముఖం ప్రకాశవంతంగా, తాజాగా కనిపిస్తుంది. మోదుగ పువ్వులు సన్ టాన్ ను తొలగించడంలో కూడా సహాయపడతాయి. ఈ పువ్వులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








