AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. మీ డైట్ లో ఈ జ్యూస్ లు చేర్చుకోండి.. వారంలోనే ఫలితం తెలుస్తుంది..

యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అసలు యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థం. ఇది పెరిగినప్పుడు కీళ్లలో వాపు , కీళ్ళ నొప్పి వంటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. అయితే ఈ సమస్యకు నివారణే మార్గం. కనుక జీవన శైలిలో మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజు యూరిక్ యాసిడ్ స్ఫటికాలను విచ్ఛిన్నం చేసి శరీరం నుంచి తొలగించడంలో సహాయపడే కొన్ని సహజ పానీయాల గురించి తెలుసుకుందాం.. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.

Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. మీ డైట్ లో ఈ జ్యూస్ లు చేర్చుకోండి..  వారంలోనే ఫలితం తెలుస్తుంది..
Remedies For Gout Relief
Surya Kala
|

Updated on: Jul 24, 2025 | 5:50 PM

Share

యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో కనిపించే వ్యర్థ పదార్థం. ఇది ప్యూరిన్ అనే సమ్మేళనం విచ్ఛిన్నం ద్వారా ఏర్పడుతుంది. ఎవరి శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే.. అది క్రమంగా అనేక తీవ్రమైన సమస్యలకు కారణం కావచ్చు. అధిక యూరిక్ యాసిడ్ కీళ్లలో వాపు, నొప్పి , గౌట్ వంటి వ్యాధులను ప్రోత్సహిస్తుంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, తక్కువ నీరు త్రాగడం, చెడు జీవనశైలి కూడా ఈ సమస్యకు ఒక పెద్ద కారణం కావచ్చు.

అటువంటి పరిస్థితిలో మందులతో పాటు, కొన్ని ఇంటి నివారణలు కూడా ఈ సమస్యని నియంత్రించడంలో సహాయపడతాయి. యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో ప్రభావవంతంగా పరిగణించబడే కొన్ని సహజ పానీయాలు, జ్యూస్‌లు ఉన్నాయి. ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేయడమే కాదు కీళ్ళ వాపు, నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడతాయి. యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవడానికి కొన్ని సహజమైన పానీయాల గురించి తెలుసుకుందాం..

క్యారెట్, బీట్‌రూట్, కీరా రసం

పెరిగిన యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవడానికి క్యారెట్, బీట్‌రూట్, కీర రసం తాగవచ్చు. దీన్ని తాగడం ద్వారా యూరిక్ యాసిడ్ స్ఫటికాలు విచ్ఛిన్నమవుతాయి. ఇవి మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు విసర్జించబడతాయి. కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఈ జ్యూస్ ని తయారు చేసుకోవాలంటే మూడింటినీ సమాన పరిమాణంలో తీసుకోవాలి.

సొరకాయ రసం

యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సొరకాయ రసం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం ద్వారా త్వరగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రసం తాగడం వలన మూత్రం ద్వారా శరీరం నుంచి విషం తొలగిపోతుంది. ఫైబర్ , పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల సొరకాయ కీళ్ళ వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

నిమ్మ రసం

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని pH స్థాయిని కూడా నిర్వహిస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ స్ఫటికాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. దీనివల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది.

ఆపిల్ రసం

ఆపిల్ రసం తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుందని కీళ్ళ నొప్పి , వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుందని, ఆర్థరైటిస్ లక్షణాలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

  1. రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు త్రాగాలి.
  2. తక్కువ ప్రోటీన్ తీసుకోవాలి
  3. రోజూ ఖచ్చితంగా వ్యాయామం చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)