AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదట మూర్ఖత్వం.. తర్వాత పశ్చాత్తాపం.. అర్థంలేని కోపంతో విధ్వంసమే.. ఈజీగా ఇలా బయటపడండి..

కోపం అనేది ఒక వ్యక్తిలో దాగి ఉన్న ఒక లోపం. అది బయటకు వచ్చినప్పుడు, అదే వ్యక్తికి హాని చేస్తుంది. ఒక వ్యక్తి ఎంత కోపంగా ఉంటే, అతని జీవితంలో అంత ఎక్కువ నష్టం జరగడానికి ఇదే కారణంగా ఉంటుంది.

మొదట మూర్ఖత్వం.. తర్వాత పశ్చాత్తాపం.. అర్థంలేని కోపంతో విధ్వంసమే.. ఈజీగా ఇలా బయటపడండి..
Motivational Thoughts Anger
Venkata Chari
|

Updated on: Feb 21, 2023 | 6:55 AM

Share

జీవితంలో ఏదో ఒక దాని గురించి కోపం తెచ్చుకోవడం మానవ సహజం. అలాగే ప్రతిరోజూ ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ ఇది ఓ చెడ్డ గుణం. దీని కారణంగా ఒక వ్యక్తి ఇతరుల కంటే తనకు తాను ఎక్కువగా హాని చేసుకుంటాడు. ఈ కోపం కారణంగా, ఒక వ్యక్తి తన జీవితానికి సంబంధించిన ప్రతి విలువైన దానిని కోల్పోతాడు. కోపం ఒక వ్యక్తిని అధిగమించినప్పుడు, సాధారణ, ప్రశాంతమైన వ్యక్తి కూడా సింహంలా గర్జించడం ప్రారంభిస్తాడు. ఇతరులకు, తనకు మధ్య ఉన్న తేడాను మరచిపోతాడు. అతను ఇతరులపై కోపాన్ని చూపిస్తుంటాడు.

కోపం అనేది ఒక వ్యక్తిలో దాగి ఉన్న ఒక లోపం. అది బయటకు వచ్చినప్పుడు, అదే వ్యక్తికి హాని చేస్తుంది. ఒక వ్యక్తి ఎంత కోపంగా ఉంటే, అతని జీవితంలో అంత ఎక్కువ నష్టం జరగడానికి ఇదే కారణంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు, అతను మౌనంగా ఉండాలి. ఈ కోపం నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోపం నుంచి మనల్ని రక్షించుకోవడానికి 5 కీలక విషయాల గురించి ఇఫ్పుడు తెలుసుకుందాం..

  1. కోపం మనిషి యొక్క అతిపెద్ద శత్రువు. ఎందుకంటే అది వస్తే శరీరం, మనస్సు, తెలివిని నాశనం చేస్తుంది.
  2. ఒక వ్యక్తి ఎప్పుడూ కోపంతో కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఆలోచనలు అతని నియంత్రణలో ఉండవు.
  3. సనాతన సంప్రదాయంలో, కోపం సమస్యలకు పరిష్కారం కాదు. కొత్త సమస్యలకు దారి తీస్తుంది.
  4. ఒక వ్యక్తి కోపంతో మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా బాధను కలిగిస్తాయి.
  5. కోపం అనేది ఒక విధ్వంసక తుఫాను లాంటిది. ఇది స్వల్పకాలమే అయినా.. ఆ వ్యక్తిలోని ప్రతిదీ నాశనం చేస్తుంది.