AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mothers Day 2025 Wishes: అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మదర్స్ డే బెస్ట్ విషెస్

అమ్మ గురించి ఏం చెప్తాం.. ఎంత చెప్పినా తక్కువే.. అమ్మ లేకపోతే జననం లేదు.. గమనము లేదు. అమ్మ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు.. అసలు ఈ సృష్టే లేదు. అమ్మను పూజించు, ప్రేమించు.. హ్యాపీ మదర్స్ డే అమ్మ

Mothers Day 2025 Wishes: అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మదర్స్ డే బెస్ట్ విషెస్
Happy Mothers Day Amma
Prashanthi V
|

Updated on: May 10, 2025 | 9:39 PM

Share

అమ్మ.. జీవితం అంతా మార్గం చూపే ప్రేమకి, త్యాగానికి ప్రతీక. ఈ లోకంలో ప్రతి ఒక్కరి తొలి గురువు తల్లే. పుట్టిన నాటి నుంచి నడక నేర్పే వరకూ ప్రతి అడుగులో అమ్మ పాలుపంచుకుంటుంది. తల్లి ప్రేమకు సమానమైనది మరొకటి లేదని అనడంలో సందేహం లేదు. తల్లి మన కోసం చేసే త్యాగాలను, ఆమె నిరంతర ప్రేమను గుర్తుచేసుకుంటూ మాతృ దినోత్సవం అనేది ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతీరోజూ అమ్మకు మనం కృతజ్ఞతలు చెప్పాల్సిందే.. ఈ రోజు ఇంకా ప్రత్యేకంగా అమ్మ కోసమే. ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మకు అభినందనలు తెలియజేయడం మన బాధ్యత. ఈ రోజున మనం తల్లుల్ని గౌరవించి.. వాళ్ల ప్రేమకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. అమ్మ మనకు దేవుడిచ్చిన గిఫ్ట్ అని గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఇది.

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 2025

  • నీ ప్రేమ నా లైఫ్‌నే మార్చేసింది అమ్మ, నీ సపోర్ట్ నాకు పెద్ద బలం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నీ ఒడిలో ఉంటే ఏదో తెలియని హాయి అమ్మ, నీ నవ్వు చూస్తే నాకెంతో ధైర్యం. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
  • అమ్మ ప్రేమకు ఏదీ సాటి రాదు, నీ దీవెనలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నీ పాటలు విని నిద్రపోయేవాడిని అమ్మ నేను, నీ ప్రేమే నన్ను జోల పాటలా లాలించింది. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నీ ప్రేమనే నాకు దారి చూపిస్తుంది అమ్మ, నీ దీవెనలే నా విజయానికి సీక్రెట్. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నీ మాటలు ఎంతో తియ్యగా ఉంటాయి, నీ చూపుల్లో ఎంతో దయ ఉంటుంది అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
  • నీ కోసం ఎంత చేసినా తక్కువే అమ్మ, నువ్వు ఉన్నావు కాబట్టే నేను ఉన్నాను. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నువ్వు నా చేయి పట్టుకున్న క్షణమే నా లైఫ్‌లో వెలుగు వచ్చింది అమ్మ. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నీవు చేసే వంటల వాసన, రుచి ఇంట్లో ఒక మంచి ఫీలింగ్‌నిస్తుంది అమ్మ, నీ ప్రేమతో ఎన్నో మంచి గుర్తులు ఉన్నాయి. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నీ ప్రేమ ఉంటే నేను ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటాను అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
  • నీ ఆలోచనలే నన్ను ముందుకు నడిపిస్తాయి అమ్మ, నీ నీడ నాకు ఒక కవచం లాంటిది. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నువ్వే నా దైవం, నువ్వే నా లైఫ్, నువ్వే నా గమ్యం అమ్మ. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నువ్వుంటే నేను ఎప్పుడూ ఒంటరి వాడిని కాను అమ్మ, నీ ప్రేమే నాకు బలం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నీ చేతుల్లో పెరిగినందుకు గర్వంగా ఉంది అమ్మ, నీ ప్రేమ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
  • అమ్మ ఒడి లాంటి సేఫ్ ప్లేస్ ఇంకెక్కడా లేదు, నీ ఒడే నాకు ప్రశాంతమైన ఇల్లు అమ్మ. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నీ పేరు తలుచుకుంటేనే గుండె నిండిపోతుంది అమ్మ, నీ ప్రేమకు రూపం లేకపోయినా దాని ఎఫెక్ట్ మాత్రం చాలా ఉంది. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నీ గుర్తులు ఎప్పుడూ నాతోనే ఉంటాయి, నీ దీవెనలే నా బలం. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
  • నువ్వు నా చేయి పట్టుకుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది, నీ పక్కన నడవడమే నాకు గర్వం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ.
  • నీ గుండె నిండా ప్రేమే ఉంది, ఆ ప్రేమే నాకు శక్తినిస్తుంది అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మ.