Mothers Day: సృష్టిలో తియ్యనైన అమ్మ కోసం మదర్స్‌డే రోజున ఇలా జరపండి.. ఆమె చిరునవ్వు మీ సొంతం

|

May 09, 2024 | 10:03 AM

పిల్లలు పెరిగేకొద్దీ చదువులో,  పనిలో బిజీగా మారతారు. కొంత సమయం అయినా తమని కని పెంచిన తల్లితో కూర్చుని మాట్లాడటానికి సమయం దొరకదు. అయితే మదర్స్ డే వంటి ప్రత్యేక సందర్భంలో ఖచ్చితంగా అమ్మ కోసం కొంత సమయం కేటాయించవచ్చు. ఈ ఏడాది మే 12న మదర్స్ డే జరుపుకోనున్నాము. అటువంటి పరిస్థితిలో అమ్మకు మీ ప్రేమని తెలియజేస్తూ అనేక విధాలుగా ప్రత్యేక అనుభూతిని కలిగించవచ్చు. ఇది వారికి సంతోషాన్నిస్తుంది. ఈ రోజు వారికి చిరస్మరణీయంగా మారుతుంది.

Mothers Day: సృష్టిలో తియ్యనైన అమ్మ కోసం మదర్స్‌డే రోజున ఇలా జరపండి.. ఆమె చిరునవ్వు మీ సొంతం
Mothers Day 2024
Follow us on

సృష్టిలో అపురూపమైనది తల్లీబిడ్డల మధ్య ఉన్న బంధ. వీరి మధ్య ఉన్న సంబంధం ప్రపంచంలోనే అత్యంత విలువైనది. కాలంతో పాటు సంబంధాలన్నీ మారుతున్నా.. తల్లికి తన బిడ్డపై ఉండే ప్రేమ ఎప్పుడూ అలాగే ఉంటుంది. అయితే పిల్లలు పెరిగేకొద్దీ చదువులో,  పనిలో బిజీగా మారతారు. కొంత సమయం అయినా తమని కని పెంచిన తల్లితో కూర్చుని మాట్లాడటానికి సమయం దొరకదు. అయితే మదర్స్ డే వంటి ప్రత్యేక సందర్భంలో ఖచ్చితంగా అమ్మ కోసం కొంత సమయం కేటాయించవచ్చు. ఈ ఏడాది మే 12న మదర్స్ డే జరుపుకోనున్నాము. అటువంటి పరిస్థితిలో అమ్మకు మీ ప్రేమని తెలియజేస్తూ అనేక విధాలుగా ప్రత్యేక అనుభూతిని కలిగించవచ్చు. ఇది వారికి సంతోషాన్నిస్తుంది. ఈ రోజు వారికి చిరస్మరణీయంగా మారుతుంది.

ఇలాంటి బహుమతులు ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ప్రత్యేకంగా జరుపుకోండి..

అమ్మకి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించడానికి సులభమైన మార్గం ఏదైనా ప్రత్యేక బహుమతిని ఇవ్వడం. వారి ఎంపిక, అవసరాలకు అనుగుణంగా తగిన బహుమతులు ఇవ్వవచ్చు. ఏది ఇచ్చినా అమ్మ కదా వారి  మొహంలో ఆనందం కనిపిస్తుంది. ఇందులో మొబైల్ ఫోన్, డిజిటల్ వాచ్ లేదా ఆభరణాల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వంటివి వారికి ఉపయోగపడే ఏదైనా ఇవ్వవచ్చు.

రోజును ప్రత్యేకంగా చేయండి

మదర్స్ డేని అమ్మ కోసం ప్రత్యేకంగా జరుపుకోవడానికి చిన్న చిన్న ప్లాన్స్ చేయవచ్చు. కుటుంబంతో కలిసి కేక్ కటింగ్, ఈవెంట్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వారికి చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

పనిలో సహాయం చేస్తూ..

ఇంటి పనిలో, వంటలో ఎల్లప్పుడూ తల్లికి సహాయం చేయాలి. ఇలా ప్రతిరోజూ సహాయం చేయడానికి మీకు సమయం లేకపోతే.. మదర్స్ డే రోజున ఆమె కోసం ఆమెకు ఇష్టమైన వంటకం సిద్ధం చేయవచ్చు. వారాంతపు రోజుల్లో వంట చేయడంలో తల్లికి సహాయం చేయవచ్చు. ఇది వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది.

బయటకు తీసుకుని వెళ్ళవచ్చు..

చిన్నతనంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని విహారయాత్రలకు తీసుకువెళతారు. మనం సంపాదించడం ప్రారంభించినప్పుడు మన స్నేహితులు, జీవిత భాగస్వాములతో కలిసి బయటకు వెళ్లడానికి ఇష్టపడతాము.  లేదా ప్రయాణానికి సమయం దొరకదు. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో పిల్లలు తమ తల్లిదండ్రులను బయటకు తీసుకెళ్లవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..