Surya Namaskar Benefits: పరుగులు పెట్టకండి.. ఉన్న చోటే ఇలా చేయండి.. ఆరోగ్యం మీ సొంతం..
Yoga Benefits For Health: ఆరోగ్యంగా ఉండటానికి యోగా సాధన చాలా మంచిదని భావిస్తారు. యోగాతో మీరు దీర్ఘకాలం పాటు అనేక వ్యాధులకు దూరంగా ఉంటారు. ఈ రోజు మనం సూర్య నమస్కారం ఎలా చేయాలో నేర్చుకుందాం. ప్రతి రోజూ ఉదయం కేవలం 10 నిమిషాలు ఇలా సాధన చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు...

చలికాలం మొదలైంది. ఉదయం లేచి అలా నాలుగు అడుగులు నడిస్తే ఆరోగ్యమే.. ఆరోగ్యం. అయితే, అలా నడిచిన వెంటనే చిన్నగా యోగ చేస్తే ఎలా ఉంటుంది. ఆలోచన బాగున్నా..మనకు యోగ రాదుగా అని అనిపిస్తుంది. అయినా.. మన దగ్గర అంత సమయం లేదుగా అని అనిపిస్తుంది. అలాగే బిజీ షెడ్యూల్ వల్ల ఎవరికీ సమయం దొరకడం లేదు. దీని వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నేటి కాలంలో చాలా మంది డెస్క్ వర్క్‌లో, కంప్యూటర్ స్క్రీన్‌పై ఎక్కువ గంటలు పని చేస్తూనే ఉన్నారు. దీని వల్ల అనేక శారీరక సమస్యలు పెరుగుతాయి. అదనంగా, మానసిక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.
అయితే ఈ సమస్యలన్నింటినీ నివారించేందుకు యోగా ఒక్కటే పరిష్కారం . మనస్సు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి యోగా పురాతన కాలం నుంచి తెలిసినప్పటికీ. అన్ని యోగాలలో, సూర్య నమస్కారం కూడా యోగాలో భాగం. దీనిని సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. మీరు దీన్ని ప్రతిరోజూ 10 నిమిషాలు మాత్రమే చేయాలి. అయితే, మీరు ఈ యోగాను ఉదయం సూర్యోదయం సమయంలో మాత్రమే చేయాలి. అయితే, సాయంత్రం కూడా కూడా చేసుకోవచ్చు. అలాగే ఖాళీ కడుపుతో చేయడం మంచిది. ఈ యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం…
1. ఊపిరితిత్తులకు మేలు..
మీరు ఉదయాన్నే సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు, మీ శ్వాసపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు, దీర్ఘంగా శ్వాస తీసుకుని, నిదానంగా వదలండి. ఇలా యోగా చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. దీంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది.
2. మనస్సు ప్రశాంత కోసం..
ఉంటుంది.మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి, ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయండి. ఇది మీ మనసుకు విశ్రాంతినిస్తుంది. సూర్య నమస్కారం ఇంట్లో మరియు ఆఫీసులో పని ఒత్తిడిని వదిలించుకోవడానికి ఉపయోగకరమైన యోగా. అందువల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంతే కాదు నిద్రలేమి సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ యోగా మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, మీ దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది.
3. గుండె ఆరోగ్యం కోసం..
మీరు ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం చేస్తే, అది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనితో పాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి. సూర్య నమస్కార సాధనతో రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా, మీ గుండె కండరాలు కూడా బలపడతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం
