Mango on EMI: పండ్లకు రారాజు మామిడి.. సామాన్యులకు అందుబాటు కోసం EMIపై అమ్మకం.. కండిషన్స్ అప్లై..
మహారాష్ట్రలోని డియోగర్, రత్నగిరిలో పండే అల్ఫోన్సోను హాపస్ మామిడి అని కూడా అంటారు. అన్ని రకాల మామిడిలో.. అల్ఫోన్సో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అయితే దీని అద్భుతమైన రుచి, తక్కువ ఉత్పత్తి కారణంగా ఈ మామిడి పండు ధర సామాన్యులకు అందుబాటులో ఉండవు.
వేసవి సీజన్ అంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పండ్ల రారాజు కోసం ఇష్టంగా ఎదురు చూస్తూ ఉంటారు. అల్ఫోన్సో మామిడి పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటి ప్రత్యేక రుచి దృష్ట్యా అల్ఫోన్సో మామిడి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. పూణేకు చెందిన ఒక వ్యాపారవేత్త వినియోగదారులకు పండ్ల రారాజును కొనుగోలు చేయడానికి సులభమైన నెలవారీ వాయిదాలతో కొనుగోలు చేసే ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. మహారాష్ట్రలోని డియోగర్, రత్నగిరిలో పండే అల్ఫోన్సోను హాపస్ మామిడి అని కూడా అంటారు. అన్ని రకాల మామిడిలో.. అల్ఫోన్సో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అయితే దీని అద్భుతమైన రుచి, తక్కువ ఉత్పత్తి కారణంగా ఈ మామిడి పండు ధర సామాన్యులకు అందుబాటులో ఉండవు.
డజన్ మామిడి పండ్ల ధర రూ. 1,300 ఈ ఏడాది కూడా అల్ఫోన్సో మామిడి పండ్లను డజన్ రూ.800 నుంచి రూ.1,300 వరకు రిటైల్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రత్యేకమైన మామిడిపండు రుచిని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు గౌరవ్ సనాస్ అనే వ్యాపారవేత్త ఓ ప్రత్యేకమైన ఆఫర్‌తో ముందుకొచ్చాడు. అంటే అల్ఫోన్సోను సులభంగా నెలవారీ వాయిదాపై ఎవరైనా కొనుక్కో వచ్చు. అరుదుగా దొరికే ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువు వలె EMIపై విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు గౌరవ్..
PTI నివేదిక ప్రకారం.. అల్ఫోన్సో మామిడి పండ్లను అమ్మకానికి పెట్టినట్లు ధరలు పెరిగాయని గౌరవ్ సనాస్ తెలిపారు. అటువంటి పరిస్థితిలో.. అల్ఫోన్సో పండ్లను కూడా EMI పై కూడా ఇస్తే.. అప్పుడు ప్రతి ఒక్కరూ ఈ పండ్ల రుచిని చూడవచ్చని చెప్పారు.
మీరు ఎలా కొనుగోలు చేయవచ్చు అంటే పండ్ల వ్యాపార సంస్థ అయిన గురుకృపా ట్రేడర్స్ అండ్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ కుమారులు దేశంలోనే EMIపై మామిడి పండ్లను విక్రయించే మొదటి స్థాపన తమదేనని పేర్కొన్నారు. ఫ్రిజ్, ఏసీ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఈఎంఐపై ఇస్తుంటే.. మామిడిపండ్లు ఎందుకు అమ్మ కూడదు అని తాము అనుకున్నామని ఆయన అన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ మామిడిని కొనుగోలు చేయవచ్చు.
EMIలో మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లే ఇక నుంచి ఈ మామిడి పండ్లను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. ఈ పండ్లను కొనుగోలు చేయాలంటే కస్టమర్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉండాలి. కొనుగోలు ధర మూడు, ఆరు లేదా 12 నెలల వాయిదాలుగా చెల్లించవచ్చు. అయితే సన్స్ స్టోర్‌లో EMI పొందాలంటే.. అల్ఫోన్సో మామిడి పండ్లను కనీసం రూ. 5 వేలు పెట్టి అయినా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటి వరకు నలుగురు ముందుకు వచ్చారని తెలిపారు. ఆ విధంగా EMIలో అల్ఫోన్సోను విక్రయించే ప్రయాణం మొదలైంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..