AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ లోపల ఉన్నది గ్యాసా? లేక నీళ్లా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

మన నిత్య జీవితంలో వంట గదిలో అత్యంత కీలకమైనది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్. సిలిండర్ అయిపోవచ్చినప్పుడు లేదా కొత్త సిలిండర్ వచ్చినప్పుడు దానిని కదిలించినప్పుడు లోపల నీళ్లు కదులుతున్నట్లు శబ్దం రావడం మనం గమనించే ఉంటాం. దీంతో చాలామందికి ఒక పెద్ద సందేహం వస్తుంది.. పేరులోనే గ్యాస్ అని ఉన్నప్పుడు, సిలిండర్ లోపల ద్రవం ఎందుకు ఉంటుంది? ఎల్పీజీ సిలిండర్ లోపల ఉండేది వాయువా లేక ద్రవమా? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ లోపల ఉన్నది గ్యాసా? లేక నీళ్లా? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!
What Is Inside Lpg Cylinde
Jyothi Gadda
|

Updated on: Sep 18, 2026 | 9:30 PM

Share

మన ఇళ్లలో నిత్యం వంట చేయడానికి ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ సిలిండర్ లోపల ఉందేది వాయువా లేక ద్రవమా ? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. సిలిండర్ నిండి ఉన్నప్పుడు ఊపితే లోపల నీళ్ల లాంటి ద్రవం కదులుతున్న శబ్దం వస్తుంది. మనం స్టవ్ వెలిగించినప్పుడు గ్యాస్‌ ద్వారా మంటను ఇస్తుంది. ఇది ఎలా సాధ్యం అనే వివరాల్లోకి వెళితే..

సిలిండర్ లోపల ఉండేది ఏమిటి?:

ఎల్పీజీ పూర్తి పేరు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అంటే ద్రవీకృత పెట్రోలియం వాయువు. ఇందులో ప్రధానంగా ప్రొపేన్, బ్యూటేన్ అనే రెండు హైడ్రోకార్బన్ వాయువులు ఉంటాయి. సాధారణ వాతావరణ ఉష్ణోగ్రత వద్ద ఇవి వాయు రూపంలోనే ఉంటాయి.

వాయువు ద్రవంగా ఎలా మారుతుంది?:

సాధారణ వాయువును భారీ పరిమాణంలో చిన్న సిలిండర్‌లో నింపడం సాధ్యం కాదు. అందుకే ఇంధన సంపీడన ప్రక్రియ ద్వారా ఈ వాయువులపై తీవ్రమైన ఒత్తిడి వినియోగిస్తారు. వాయువులపై అధిక ఒత్తిడి పడినప్పుడు, వాటి అణువులు దగ్గరకు చేరి వాయువు కాస్త ద్రవ రూపంలోకి మారుతుంది. అందువల్ల సిలిండర్ లోపల 85శాతం వరకు ఇంధనం ద్రవ రూపంలోనే నిల్వ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మనం స్టవ్ వెలిగించినప్పుడు ఏం జరుగుతుంది?:

మనం సిలిండర్ రెగ్యులేటర్ ఆన్ చేసి స్టవ్ వెలిగించినప్పుడు, సిలిండర్ లోపలి ఒత్తిడి ఒక్కసారిగా తగ్గుతుంది. ఒత్తిడి తగ్గగానే ద్రవ రూపంలో ఉన్న ప్రొపేన్, బ్యూటేన్‌లు తిరిగి వాయు రూపంలోకి మారి పైపు ద్వారా బర్నర్ వద్దకు చేరుకుంటాయి. ఆ వాయువే మనకు మంటను ఇస్తుంది.

గ్యాస్ వాసన వెనుక ఉన్న నిజం:

ప్రొపేన్, బ్యూటేన్ వాయువులకు స్వతహాగా ఎలాంటి వాసనా ఉండదు. ఒకవేళ సిలిండర్ లీక్ అయితే ప్రమాదాలు జరగకుండా ముందే గుర్తుపట్టడం కోసం ఈథైల్ మెర్కాప్టన్ అనే రసాయనాన్ని ఇందులో చేరుస్తారు. ఆ ఘాటైన వాసన వల్లే మనం గ్యాస్ లీకేజీని వెంటనే పసిగట్టగలుగుతున్నాం.

మొత్తానికి, ఎల్పీజీ సిలిండర్ లోపల ఉండేది ద్రవ రూపంలో ఉన్న వాయువు. ఒత్తిడి వల్ల అది ద్రవంగా మారి సిలిండర్‌లో దాగి ఉంటుంది. బయటకు వచ్చేటప్పుడు వాయువుగా మారి మనకు ఉపయోగపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us