AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లివర్‌ ఆరోగ్యానికి బెస్ట్ టిప్స్.. డైలీ ఇలా చేస్తే మీరు సేఫ్..

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి.. కాలేయం, అనేక ముఖ్యమైన జీవక్రియలను నిర్వహిస్తుంది.. పైత్యరసం ఉత్పత్తి చేయడం, ఆహారంలోని పోషకాలను జీర్ణం చేయడంలో సహాయపడడం, విష పదార్థాలను శుద్ధి చేయడం, రక్తాన్ని గడ్డకట్టించడంలో సహాయపడే ప్రోటీన్లను తయారు చేయడం వంటి కీలక విధులను నిర్వహిస్తుంది.

లివర్‌ ఆరోగ్యానికి బెస్ట్ టిప్స్.. డైలీ ఇలా చేస్తే మీరు సేఫ్..
Liver Health
Shaik Madar Saheb
|

Updated on: Aug 16, 2025 | 1:35 PM

Share

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి.. కాలేయం, అనేక ముఖ్యమైన జీవక్రియలను నిర్వహిస్తుంది.. పైత్యరసం ఉత్పత్తి చేయడం, ఆహారంలోని పోషకాలను జీర్ణం చేయడంలో సహాయపడడం, విష పదార్థాలను శుద్ధి చేయడం, రక్తాన్ని గడ్డకట్టించడంలో సహాయపడే ప్రోటీన్లను తయారు చేయడం వంటి కీలక విధులను నిర్వహిస్తుంది. అయితే.. మనం ప్రతిరోజూ తినే పదార్థాలు ఆకలిని తీర్చడమే కాదు.. ఇవి మన కాలేయం ఆరోగ్యానికి కూడా చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి.. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కాలేయానికి ప్రయోజనకరంగా.. హానికరంగా ఉండే అనేక సాధారణ ఆహారాలు ఉన్నాయి. అందుకే.. లివర్ ఆరోగ్యంపై దృష్టిపెట్టడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.. కాలేయం ఆరోగ్యానికి ఏమి తినాలి.. ఏమి నివారించాలి..? హార్వర్డ్ వైద్యుడు డాక్టర్ సౌరభ్ సేథి ఇచ్చే సలహా ఏంటి? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..

మీరు ప్రతిరోజూ మీ ప్లేట్‌లో ఏమి తింటున్నారు..? మీరు సరైన కలయికతో తింటున్నారో లేదో మీకు తెలుసా..? మీరు ఏది తిన్నా అది జీర్ణక్రియ – కాలేయంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. హార్వర్డ్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సేథి తన పరిశోధనలో మీ కాలేయానికి హాని కలిగించే లేదా ప్రయోజనం చేకూర్చే సాధారణ .. ఆహార పదార్థాల గురించి చెప్పారు. చిన్న మార్పులు మీ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఏ ఆహార పదార్థాలు ప్రయోజనకరమైనవి.. ఏవి ప్రమాదకరమైనవి..? తెలుసుకోండి..

కాలేయానికి అనుకూలమైన ఎంపికలు ఏమిటి?

ఖర్జూరాలు + వాల్‌నట్స్: ఖర్జూరాలలో ఫైబర్ ఉంటుంది.. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి వాపును తగ్గిస్తాయి.

చక్కెర లేకుండా కొన్ని గింజలతో డార్క్ చాక్లెట్: ఇందులో కాలేయ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.. విటమిన్ ఇ కూడా ఉంటుంది.

ఆపిల్ ముక్కలు + తేనె + దాల్చిన చెక్క: ఆపిల్ లోని పెక్టిన్ అనే ఫైబర్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తేనె – దాల్చిన చెక్క జీర్ణక్రియకు సహాయపడతాయి.. మీ కడుపు సులభంగా క్లియర్ అవుతుంది.

గ్రీక్ పెరుగు లేదా బెర్రీలతో కూడిన పెరుగు: ప్రోబయోటిక్స్ – యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలతో సమృద్ధిగా ఉన్న ఈ కాంబో ఈ భాగాలన్నింటినీ కలపడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

కాలేయాన్ని బలహీనపరిచే ఆహారాలు..

చక్కెర స్మూతీలు – ప్రాసెస్ చేసిన పానీయాలు: ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, కాలేయంలో కొవ్వును పేరుకుపోయేలా చేస్తాయి.. మాస్టర్ డిటాక్సిఫైయర్‌ను నెమ్మదిస్తాయి.

సోయాబీన్, మొక్కజొన్న – పొద్దుతిరుగుడు నూనెలు వంటి విత్తన నూనెలు: వీటిలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.. ఇవి కాలేయంలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి.

తాజా పండ్ల రసం లేదా అధిక తీపి రసం (100% పండ్ల రసం): వీటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది.. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది నేరుగా కాలేయానికి చేరుకుని అక్కడ కొవ్వును జమ చేస్తుంది.. ఇది కొవ్వు కాలేయం ప్రమాదాన్ని పెంచుతుంది.

లివర్ ఆరోగ్యానికి.. నీళ్లు, బ్లాక్ కాఫీ సరిపోతాయా?

కానీ కేవలం స్వచ్ఛమైన నీరు కాలేయానికి బెస్ట్ ఫ్రెండ్ అని మీరు ఊహించగలరా? అవును.. హార్వర్డ్ పరిశోధన ప్రకారం నీరు, బ్లాక్ కాఫీ (చక్కెర-క్రీమ్ కాదు) కాలేయానికి ఉత్తమమైన పానీయాలు.. అవి కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి. కాఫీలో ఉండే పాలీఫెనాల్స్ కాలేయాన్ని రక్షిస్తాయి.

మీ అలవాట్లలో ఏం మార్చుకోవాలి..

వాల్‌నట్‌లు, డార్క్ చాక్లెట్, గింజలతో కూడిన ఖర్జూరాలు, ఆపిల్స్, తేనె, దాల్చిన చెక్క, గ్రీక్ పెరుగు, బెర్రీలు వంటి చురుకైన స్నాక్స్‌ను ఎంచుకోండి.

తీపి రసాలు – ప్రాసెస్ చేసిన పానీయాలకు దూరంగా ఉండండి – ఇవి సంవత్సరాల తరబడి కాలేయాన్ని లోపలి నుండి బలహీనపరుస్తాయి.

ఆరోగ్యకరమైన పండ్లు – కూరగాయల ఆహారాలు తినండి.. ప్రాసెస్ చేసిన చక్కెర ఆహారాలను నివారించండి.

మీ పానీయాల దినచర్యలో నీరు – బ్లాక్ కాఫీని చేర్చుకోండి. ఈ సాధారణ మార్పులు కాలేయానికి కొత్త జీవితాన్ని కూడా ఇస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..