
కూరగాయలు శరీరానికి పోషకాలను అందిస్తాయి. కొన్ని కూరగాయలు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. కానీ వాటి నిజమైన విలువను మనం అర్థం చేసుకోలేము. దొండకాయ కూడా అలాంటిదే.. ఆకుపచ్చగా ఉండే కూరగాయ చూసేందుకు ఎంతో నిరాడంబరంగా కనిపిస్తుంది. కానీ, ఈ కూరగాయ బరువు తగ్గడానికి, చక్కెర నియంత్రణకు, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి మాత్రమే కాకుండా, శరీరం నుండి విషాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది.
దొండకాయలో తినదగిన ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. ఇది ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీని తక్కువ గ్లైసెమిక్ సూచిక చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రోజంతా శక్తిని కాపాడుతుంది. అందుకే ఈ కూరగాయ మధుమేహ రోగులకు అమృతంలాంటిది అంటున్నారు నిపుణులు. దొండకాయలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక తీవ్రమైన వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ కూరగాయలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటుంది.
దొండకాయ కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది. ఇది ఫైబర్ మంచి మూలం. దొండకాయ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు..దొండకాయ గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దొండకాయ కూడా తినొచ్చు. దొండకాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తి సమస్యలు దూరమవుతాయి. చర్మ సమస్య తామర నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..