AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Paneer: మీరు వాడే పన్నీర్ అసలైందేనా? ఈ సింపుల్‌ టిప్స్‌తో చిటికెలో తెలుసుకోండి..

పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడే ఆహారాల్లో పనీర్ ఒకటి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ మార్కెట్లో రసాయనాలతో తయారు చేసిన రకరకాల పనీర్‌లు కూడా అమ్ముతున్నారు. అయితే మీరు కొనుగోలు చేసే పనీర్ పాలతో తయారు చేసిందా లేదా నకిలీదా అని ఈ కింది సింపుల్ టిప్స్‌తో చిటికెలో తెలుసుకోవచ్చు..

Fake Paneer: మీరు వాడే పన్నీర్ అసలైందేనా? ఈ సింపుల్‌ టిప్స్‌తో చిటికెలో తెలుసుకోండి..
Paneer
Srilakshmi C
|

Updated on: Feb 06, 2025 | 4:38 PM

Share

ఇటీవలి రోజుల్లో మార్కెట్లో ప్రతిదీ నకిలీ మయం అవుతున్నాయి. కొందరు వ్యాపారులు లాభాలకు కక్కుర్తిపడి ఆహార పదార్థాలు సైతం కల్తీమయం చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాటిల్లో వంటకు వినియోగించే పనీర్ కూడా ఉంది. అందరూ ఇష్టపడే పనీర్ రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కానీ మార్కెట్లో రసాయనాలతో తయారు చేసిన పనీర్‌లు కూడా అమ్ముతున్నారు. అయితే మీరు కొనుగోలు చేసే పనీర్ పాలతో తయారు చేసిందా లేదా నకిలీదా అని మీరు ఇంట్లోనే సులభంగా తెలుసుకోవచ్చు. ఎలాగంటే..

మీరు మార్కెట్‌లో కొనుగోలు చేసిన పనీర్‌ను ఒక ప్లేట్‌లో ఉంచి, చేతులతో నలగగొట్టడానికి ప్రయత్నించాలి. ఇది మెత్తగా ఉంటుంది. కాబట్టి చేతులతో నలిపితే అది పొడిగా మారుతుంది. కానీ నకిలీ పనీర్ సింథటిక్ రసాయనాలతో తయారవుతుంది. దీంతో అది గట్టిగా ఉంటుంది. అది రబ్బరులా ఉండి, మీరు ఎంత నలిపినా త్వరగా నలిగిపోకపోగా, బంతిలా ఎగురుతుంది. ఇలా జరిగితే అది నకిలీదని అర్ధం చేసుకోవాలి. అలాగే పనీర్ రంగును బట్టి కూడా అది నకిలీదా లేక అసలైనదా అని చిటికెలో చెప్పవచ్చు. స్వచ్ఛమైన పనీర్ ఎల్లప్పుడూ లేత తెలుపు రంగులో ఉంటుంది. కానీ సింథటిక్ పనీర్ తెల్లగా ఉంటుంది. ఇలా తెల్లగా ఉంటే వెంటనే దానిని నకిలీగా గుర్తించాలి. అలాగే తెల్లటి కాగితంపై పనీర్‌ను రుద్దితే అది రంగు మారితే, అది కల్తీ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

అయోడిన్ పరీక్ష చేయడం ద్వారా కూడా పనీర్ స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. ముందుగా, పనీర్‌లో కొంత భాగాన్ని తీసుకొని నీటిలో ఐదు నిమిషాలు మరిగించి, ఒక ప్లేట్‌లో ఉంచి చల్లబరచాలి. తరువాత, పైన రెండు చుక్కల అయోడిన్ టింక్చర్ వేయాలి. పనీర్ నీలం రంగులోకి మారితే అది నకిలీదని అర్ధం. అలాగే పనీర్‌ వాసన ద్వారా కూడా నిజమైన పనీర్‌ను గుర్తించవచ్చు. పాలతో తయారు చేసిన పనీర్ పెరుగు లేదా పుల్లని వాసన కలిగి ఉంటుంది. కానీ సింథటిక్ పనీర్‌లో కృత్రిమ వాసన ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మీరు మార్కెట్లో పనీర్ కొనుగోలు చేసేటప్పుడు ప్యాకేజింగ్ ను శ్రద్ధగా గమనించాలి. నిజమైన పనీర్ ఘన రూపంలో ఉంటుంది. నకిలీ పనీర్‌ను ప్యాకేజింగ్‌లో ముక్కలు చేసి ఉంటుంది. అలాగే మీరు కొన్న పనీర్ కల్తీ అయిందో లేదో తనిఖీ చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో పనీర్ ముక్కను వేసి నీళ్లు పోసి మరిగించాలి. అందులో ఒక టీస్పూన్ ఉప్పు వేసి.. పది నిమిషాలు ఉడికించిన తర్వాత చూడాలి. పనీర్ లేత ఎరుపు రంగులోకి మారితే, దానికి డిటర్జెంట్, యూరియా వంటి కలిపినట్లు అర్థం. పనీర్ ఉష్ణోగ్రతను పరీక్షించడం ద్వారా దాని స్వచ్ఛతను నిర్ధారించవచ్చు. ముందుగా ఒక పాన్ లో చిన్న పనీర్ ముక్క తీసుకొని వేయించాలి. అసలైన పనీర్ గోధుమ రంగులోకి మారుతుంది. కానీ నకిలీ పనీర్ కరిగిపోతుంది. ఇది అదనపు నీటిని విడుదల చేయడమే కాకుండా, జిడ్డు మారుతుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.