Coffee: కాఫీ తాగే అలవాటు.. మీ చర్మ ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్ చెప్పిన నిజాలు ఇవే!
చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొందరు మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సుమారు 4-5 టైమ్స్ కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ తాగడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటేంటే.. కాఫీ తాగడం వల్ల ఏవైనా చర్మ సమస్యలు వాస్తాయా అని.. మీకు ఈ డౌట్ ఉంటే డాక్టర్ చెస్తున్న ఈ విషయాలు తెలుసుకోండి.

కాఫీ తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో చర్మ ఆరోగ్యం కూడా ఒకటి. అవును కాఫీ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సహానా వెంకటేష్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో చేసిన పోస్ట్ ప్రకారం. కాఫీ చర్మానికి, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆమె చెబుతున్నారు. కాఫీ అనేది చర్మ అలసటతో పోరాడుతుంది, అలాగే అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. కాఫీలో మంచి మొత్తంలో ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాకుండా, అవి చర్మంతో పాటు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కానీ ఈ ప్రయోజనాలన్నింటినీ పొందాలంటే మీరు కాఫీని మితంగా తాగాల్సి ఉంటుంది.
అయితే, ఎక్కువగా కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్, మొటిమలు, కార్టిసాల్ పెరగడం, జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతున్నారు. కాఫీలో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అలాగే, అధిక కెఫిన్ వినియోగం ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను పెంచుతుంది. ఇది మీ చర్మానికి కూడా హానికరం.
మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే.. ఈ టిప్స్ పాటించండి
- డాక్టర్ సహానా వెంకటేష్ ప్రకారం, కొన్ని జాగ్రత్తలను దృష్టిలో ఉంచుకుని కాఫీ తాగవచ్చు.
- మీకు కాఫీ అలవాటు ఉంటే మితంగా తాగడం ఉత్తమం. ఎక్కువ కాఫీ తాగకుండా ఉండండి.
- మీరు రోజుకు 2 కప్పులు లేదా గరిష్టంగా 3 కప్పులు తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
- ఒక వేళ మీరు కాఫీ ప్రియులైతే, మీ నీళ్లు ఎక్కువ తాగడం అలవాటు చేసుకోండి.
- ఉదాహరణకు మీరు కప్పు కాఫీ తాగితే 2 గ్లాసుల నీరు త్రాగాలి. అది రోజు మొత్తంలో ఎప్పుడైనా
- ఇది డీహైడ్రేషన్‌ను నివారించడానికి, కాఫీ దుష్ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
- పాలతో కాఫీ తాగడం వల్ల మీ చర్మానికి, మీ ఆరోగ్యానికి హానికరం. బదులుగా, మీరు బ్లాక్ కాఫీ తాగవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
