భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ మందగిస్తుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలిస్తే..
భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందని, ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగ్గా శోషించబడవని చాలా మంది నమ్ముతారు. దీని కారణంగా, భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల నుండి 1 గంట వరకు స్నానం చేయకూడదనే నమ్మకం ఉంది. కానీ, ఈ నమ్మకంలో నిజం ఉందా? భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం నిజంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ ప్రసన్న కార్తీక్ ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆయన చెప్పిన కీలక సమాచారాన్ని మీరు వివరంగా తెలుసుకుందాం..

చాలామంది ఇళ్లలో పెద్దలు తిన్న వెంటనే స్నానం చేయకూడదు, కొంచెం సేపు ఆగాలి అని చెబుతుంటారు. తిన్న వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుందని, ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అందవని గట్టిగా నమ్ముతుంటారు. దీనివల్ల భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల నుండి 1 గంట వరకు స్నానం చేయకుండా ఆగుతుంటారు. కానీ, ఈ వాదనలో నిజం ఎంత? భోజనం చేసిన వెంటనే స్నానం చేయటం అనేది ఆరోగ్యానికి హానికరమా? ఈ ప్రశ్నలకు ప్రముఖ వైద్య నిపుణులు వెల్లడించిన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
భోజనం తర్వాత శరీరంలో ఏం జరుగుతుంది?
మనం ఆహారం తిన్న తర్వాత, దానిని సక్రమంగా జీర్ణం చేయడానికి, పోషకాలను శోషించుకోవడానికి జీర్ణకోశం వైపు రత్త ప్రసరణ సహజంగానే పెరుగుతుంది. ఇదే సమయంలో మనం స్నానం చేసినప్పుడు, ముఖ్యంగా వేడి నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత, రక్త ప్రసరణలో చిన్నపాటి మార్పులు సంభవిస్తాయి. అయితే, ఈ ప్రక్రియ వల్ల జీర్ణక్రియ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోతుందనో లేదా ఆహారం అరగకుండా పోతుందనో చెప్పడానికి ఎటువంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.
వేడి నీటి స్నానం వల్ల వచ్చే సమస్యలు:
సాధారణంగా భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం ప్రమాదం కాకపోయినా, నీటి ఉష్ణోగ్రత చాలా ముఖ్యం. మితిమీరిన వేడి నీటితో స్నానం చేస్తే, రక్తపోటులో తాత్కాలిక మార్పులు వస్తాయని, కొందరిలో తలతిరుగుదల లేదా కళ్ళు తిరిగే సమస్య రావచ్చు. ముఖ్యంగా లో-బీపీ సమస్య ఉన్నవారు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. కడుపు నిండా తిన్న తర్వాత నీళ్లలో తడిస్తే కొంత అసౌకర్యం కలగడం సహజం. అందువల్ల ఎంతో వేడిగా ఉండే నీటిని కాకుండా, గోరువెచ్చని లేదా సాధారణ నీటిని ఉపయోగించడం ఉత్తమం.
భోజనం చేసిన ఎంతసేపటి తర్వాత స్నానం చేయాలి?
తిన్న వెంటనే స్నానం చేయడానికి కచ్చితంగా ఇన్ని నిమిషాలు ఆగాలి అనే గట్టి నియమం ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉన్న పెద్దలు తమ శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. మీకు ఎలాంటి అసౌకర్యం లేకపోతే ఎప్పుడైనా స్నానం చేయవచ్చు. ఒకవేళ స్నానం చేసేటప్పుడు తరచూ తలతిరుగుడు లేదా నీరసంగా అనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.




