AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: హైదరాబాద్ టు అయోధ్య వయా వారణాసి.. ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ఆహ్లాదం.. అతి తక్కువ ధరలోనే..

ఏదైనా ఆధ్యాత్మిక నేపథ్యం కలిగి, ప్రాంతమైతే బాగుండని ఆలోచిస్తున్నారా? అయితే మీకో అద్భుతమైన ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్ సీటీసీ) టూరిజమ్ అందిస్తున్న అయోధ్య టూర్. గంగా రామయన్ యాత్ర పేరిట హైదరాబాద్ టు అయోధ్య వయా వారణాసి టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అది కూడా అనువైన బడ్జెట్లోనే మంచి సౌకర్యాలతో అందిస్తోంది.

IRCTC Tour: హైదరాబాద్ టు అయోధ్య వయా వారణాసి.. ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ఆహ్లాదం.. అతి తక్కువ ధరలోనే..
Varanasi
Follow us
Madhu

|

Updated on: Aug 05, 2023 | 6:30 PM

రోజూ వారి పనులు, వర్క్ టార్గెట్లతో విసిగిపోయారా? మనసు ప్రశాంతత కోరుకుంటుందా? ప్రతి సారి వెళ్లే వీకెండ్ టూర్ లా కాకుండా.. ఈ సారి కాస్త ఎక్కువ దూరం వెళ్తే బాగుండని భావిస్తున్నారా? అందులోనూ ఏదైనా ఆధ్యాత్మిక నేపథ్యం కలిగిన ప్రాంతమైతే బాగుండని ఆలోచిస్తున్నారా? అయితే మీకో అద్భుతమైన ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్ సీటీసీ) టూరిజమ్ అందిస్తున్న అయోధ్య టూర్. గంగా రామాయణ్ యాత్ర పేరిట హైదరాబాద్ టు అయోధ్య వయా వారణాసి టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అది కూడా అనువైన బడ్జెట్లోనే మంచి సౌకర్యాలతో టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఫ్లైట్ జర్నీతో పాటు ఏసీ బస్ ఫెసిలిటీని అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టూర్ వివరాలు..

పేరు: గంగా రామాయణ్ యాత్ర

సమయం: ఐదు రాత్రులు, ఆరు రోజులు

ఇవి కూడా చదవండి

ప్రయాణం: విమానంలో కంఫర్ట్ క్లాస్ ప్రయాణం, ఏసీ బస్సులో లోకల్ విజిట్

అందుబాటులో ఉన్న ప్రయాణ తేదీలు: ఆగస్టు 9, ఆగస్టు 27, సెప్టెంబర్ 27

పర్యటించే ప్రాంతాలు: వారణాసి – ప్రయాగ్‌రాజ్ – అయోధ్య – లక్నో – నైమిశరణ్య

పర్యటన సాగేదిలా..

డే1(ప్రయాణం ప్రారంభం): హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. వారణాసి చేరుకొని, హోటల్‌లో చెకిన్ అవుతారు. హోటల్‌లో భోజనం చేస్తారు. కాశీ దేవాలయం, గంగా ఘాట్ సందర్శిస్తారు. వారణాసిలోనే రాత్రి బస చేస్తారు. ప్యాకేజీలో భాగంగా లంచ్, డిన్నర్ అందిస్తారు. వారణాసి ఘాట్ లు, ఆలయం వద్దకు బస్సులు అనుమతించరు. అక్కడ పర్యాటకులు సొంత ఖర్చులతో ఆటోలలో ప్రయాణించాల్సి ఉంటుంది.

డే2(వారణాసి లోకల్ టూర్): హోటల్ లోనే అల్పాహారం చేసిన తర్వాత సారనాథ్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం తిరిగి వారణాసికి చేరుకుంటారు. బిర్లా ఆలయం, ఘాట్‌లను సందర్శిస్తారు. సొంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు.

డే3(వారణాసి – ప్రయాగ్‌రాజ్ – అయోధ్య టూర్): హోటల్ చెక్ అవుట్ చేసి ప్రయాగ్‌రాజ్‌కి బయలుదేరుతారు. అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు బయలుదేరుతారు. అయోధ్యలోని హోటల్ లో చెకిన్ అవుతారు. ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు.

డే4(అయోధ్య – లక్నో): హోటల్‌లో అల్పాహారం చేసిన తర్వాత అయోధ్య ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నానికి హోటల్లో చెక్ అవుట్ చేసి, లక్నోకి బయలుదేరుతారు. అక్కడే రాత్రి బస చేస్తారు. ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు.

డే5(లక్నో – నైమిశారణ్య – లక్నో): హోటల్‌లో అల్పాహారం చేసి రోజంతా నైమిశారణ్య దర్శనం చేసుకుంటారు. సాయంత్రం తిరిగి లక్నోకి వచ్చి లక్నోలో రాత్రి బస చేస్తారు. ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు.

డే6(లక్నో – హైదరాబాద్): అల్పాహారం చేశాక హోటల్ చెక్ అవుట్ చేస్తారు. అక్కడి నుంచి లక్నో విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్ రిటర్న్ జర్నీ మొదలవుతుంది.

టూర్ ధరలు ఇలా..

ఐఆర్ సీటీసీ గంగా రామాయణ్ యాత్ర టూర్ ధర వివరాలు చూస్తే..

  • ఆగస్టు 9 తేదీన ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 26,850గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.28,600, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.34,650గా ఉంటుంది.
  • ఆగస్టు 27వ తేదీన ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 27,250గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.27,550గా ఉంటుంది.
  • సెప్టెంబర్ 27వ తేదీన టూర్ కి ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ. 27,450గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.29,150, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.35,700 ఉంటుంది.
  • టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. మరిన్ని వివరాలకు, టూర్ ప్యాకేజీని బుక్ చేసుకునేందుకు ఐఆర్ సీటీసీ టూరిజమ్ అధికారిక  వెబ్ సైట్ సందర్శించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..