మానసిక ఆరోగ్యానికి మేలు చేసే చంద్ర నమస్కారం అంటే ఏమిటి.. ? ప్రయోజనాలు ఏమిటంటే

|

Jun 21, 2024 | 7:37 PM

సూర్య నమస్కారం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది లేదా దాని గురించి విని ఉంటారు. అయితే అతి తక్కువ మందికి మాత్రమే చంద్ర నమస్కారం గురించి తెలుసు. సూర్య నమస్కారం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లే, చంద్ర నమస్కారం కూడా శరీరక బాహ్య , అంతర్గత అవయవాలకు, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ చంద్ర నమస్కరానికి కూడా సూర్య నమస్కారం వలె 12 యోగా ఆసనాలు ఉన్నాయి.

మానసిక ఆరోగ్యానికి మేలు చేసే చంద్ర నమస్కారం అంటే ఏమిటి.. ? ప్రయోజనాలు ఏమిటంటే
Chandra Namaskar
Image Credit source: freepik
Follow us on

ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలు పండుగలా జరుపుకుంటారు. యోగా శరీరరక బలాన్ని మాత్రమే కాదు మానసిక బలాన్ని కూడా పెంచుతుంది. అందుకే యోగాలోని ప్రతి టెక్నిక్ మనిషి ఆరోగ్యకరంగా సంతోషకరంగా ఉండేలా చేస్తుంది. భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన యోగా నేడు ప్రపంచ వ్యాప్తంగా ఒక భావనగా మారింది. యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయి.. వాటికి వివిధ రకాల ప్రయోజనాలున్నాయి. అయితే సూర్య నమస్కారం అనేది యోగాలోని అద్భుతమైన యోగాసనం. ఈ సూర్య నమస్కారాన్ని 12 ఆసనాలు కలిసి చేస్తారు. అయితే ఈ రోజు మనం సూర్య నమస్కారం గురించి కాకుండా చంద్ర నమస్కారం గురించి తెలుసుకుందాం..

సూర్య నమస్కారం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది లేదా దాని గురించి విని ఉంటారు. అయితే అతి తక్కువ మందికి మాత్రమే చంద్ర నమస్కారం గురించి తెలుసు. సూర్య నమస్కారం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లే, చంద్ర నమస్కారం కూడా శరీరక బాహ్య , అంతర్గత అవయవాలకు, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ చంద్ర నమస్కరానికి కూడా సూర్య నమస్కారం వలె 12 యోగా ఆసనాలు ఉన్నాయి. అయితే వీటిని చేసే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కనుక సూర్య నమస్కారం కంటే చంద్ర నమస్కారం ఎంత భిన్నంగా ఉంటుంది. ఈ చంద్ర నమస్కారం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో నిపుణుల చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం..

సూర్య నమస్కారం- చంద్ర నమస్కారం మధ్య తేడా ఏమిటంటే..

ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా మాట్లాడుతూ సూర్య నమస్కారం శక్తివంతంగా ఉండగా.. చంద్ర నమస్కారం శరీరాన్ని ప్రశాంతంగా .. చల్లగా ఉంచడంలో సహాయపడుతుందని.. ఓదార్పు ప్రభావాన్ని (రిలాక్స్‌డ్ ఫీలింగ్) ఇస్తుందని చెప్పారు. చంద్ర నమస్కారం లో కూడా సూర్య నమస్కారం లాగా 12 భంగిమలు చేయాల్సి ఉంటుంది. అయితే చంద్ర నమస్కారం చేసేటప్పుడు శరీరాన్ని ముందుకు వంచడం జరగదు.. ఆసనం వేసేటప్పుడు శరీరం పక్కకు వంగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చంద్ర నమస్కారం ఎలా చేయాలంటే

నిపుణుడు కిరణ్ గుప్తా ప్రకారం చంద్ర నమస్కారం నిలబడి ఉన్న భంగిమతో.. నమస్కార ముద్రతో ప్రారంభించబడుతుంది. అప్పుడు పర్వత ముద్ర ఏర్పడుతుంది. దీనిలో చేతులు భుజాలకు అనుగుణంగా పైకి విస్తరించి ఉంటాయి. అయితే పాదాలను నేల నుండి పైకి ఎత్తకూడదు. దీని తర్వాత త్రికోణాసనం వేయాల్సి ఉంటుంది. చంద్ర నమస్కారంలో.. 12 భంగిమలు ఎడమ వైపు నుంచి ప్రారంభించి.. ఆపై 12 భంగిమలు కుడి వైపున చేస్తారు. అయితే ఇది ఎడమ వైపు నుంచి ప్రారంభించి ఎడమవైపు మాత్రమే చంద్ర నమస్కారం పూర్తి చేస్తారు. త్రికోనాసనం, స్కాట్ భంగిమ తరువాత, సూర్య నమస్కారంలా అదే క్రమంలో మలాసనం, పశ్చిమోత్తాసనం మొదలైన వాటిని చేయడం ద్వారా అన్ని ఆసనాలు పూర్తవుతాయి.

చంద్ర నమస్కారం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

నిపుణుడు కిరణ్ గుప్తా మాట్లాడుతూ చంద్ర నమస్కారం చేయడం వల్ల శరీరం చల్లగా , ప్రశాంతంగా ఉండటమే కాకుండా శరీరం వశ్యతను పెంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది. వెన్నునొప్పితో బాధపడేవారికి చంద్ర నమస్కారం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి కూడా చంద్ర నమస్కారం చేయడం చాలా మేలు చేస్తుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే

ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా మాట్లాడుతూ చాలా మంది చంద్ర నమస్కార భంగిమలను సాగదీయడంగా భావిస్తారు. అయితే అత్యంత మేలు చేస్తుంది. కానీ చంద్ర నమస్కారం చేయడం అంత సులభం కాదు. ఇతర యోగాసనాలు చేసేటప్పుడు శరీరంపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదో.. అదే విధంగా చంద్ర నమస్కారం చేసేటప్పుడు శరీరాన్ని ఎక్కువగా వంచడానికి ప్రయత్నించకూడదు. దీన్ని సౌకర్యవంతంగా చేయండి, ఇది శరీరానికి చాలా విశ్రాంతి, ప్రయోజనాలను ఇస్తుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..