Health Care Tips: శరీరాన్ని చురుకుగా, ఫిట్‌గా ఉంచడానికి తగినంత శక్తి అవసరం. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శరీరంలో తగినంత శక్తి లేకపోవడమనేది అకస్మాత్తుగా చాలా సార్లు జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో రోజంతా నిదానంగా, అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. శరీరంలో శక్తి లేకపోవడం వల్ల పనిపై కూడా ప్రభావం పడుతుంది. చాలామంది చిన్న చిన్న పనులకే అలసిపోతుంటారు. ఇలాంటి సమయాల్లో శరీరాన్ని చురుకైనదిగా చేయడానికి, శక్తి కోసం మంచి ఆహారం తీసుకోవాలి. అయితే.. తక్షణ శక్తిని ఇచ్చే 5 పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతోపాటు.. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
శరీరంలో శక్తి లోపిస్తే కనిపించే సంకేతాలు..
తక్షణ శక్తి కోసం వీటిని తీసుకోండి..
అరటిపండు: తక్షణ శక్తిని పొందడానికి ఆహారంలో అరటిపండును చేర్చుకోవాలి. ఇది చాలా మందికి నచ్చిన పండు. పిల్లలకు కూడా ఇష్టమైన ఆహారం. మీకు శక్తి తక్కువగా అనిపిస్తే, వెంటనే ఒక అరటిపండు తినండి.
కాఫీ: ఎనర్జీ డ్రింక్‌లో కాఫీ కూడా ఒకటి. మీకు శక్తి తక్కువగా అనిపిస్తే వెంటనే కాఫీ తాగండి. కాఫీ తాగడం వల్ల అలసట, నిద్ర, నీరసం నుంచి ఉపశమనం కలిగి తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే కాఫీని మంచి శక్తి వనరుగా పరిగణిస్తారు.
బ్రౌన్ రైస్: శరీరంలో శక్తి తక్కువగా ఉన్నప్పుడు బ్రౌన్ రైస్ తినవచ్చు. తక్షణ శక్తినిచ్చే పోషకాలు బ్రౌన్ రైస్‌లో ఉంటాయి. సాధారణ అన్నం కాకుండా బ్రౌన్ రైస్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శక్తిని కలిగించేందుకు దోహదపడతాయి.
చిలగడదుంప: తక్షణ శక్తిని పొందడానికి చిలగడదుంప తినవచ్చు. చిలగడదుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిలగడదుంపలను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. దీని వల్ల శరీరంలో పోషకాల లోపం తీరుతుంది.
ఖర్జూరాలు: అలసిపోయినట్లు, బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తే తక్షణ శక్తి కోసం ఖర్జూరాలను తినవచ్చు. ఇది సహజ చక్కెరను కలిగి ఉంటుంది. కావున తక్షణ శక్తిని ఇస్తుంది. అందుకే ఖర్జూరాలను శక్తిమంతమైన ఆహారంగా పరిగణిస్తారు. రోజూ 4-5 ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి