Skin Glowing Tips: ఈ విటమిన్ ఉన్న ఆహారాలు తీసుకుంటే.. స్కిన్ మెరిసిపోతుంది!
అందంగా కనిపించాలని మహిళలు, పురుషులు తెగ ప్రయాస పడుతూ ఉంటారు. అందులోనూ యంగ్ ఏజ్‌లో ఉండే అబ్బయిలు, అమ్మాయిల సంగతి అయితే అసలు చెప్పాల్సిన పని లేదు. అందాన్ని మెరిపించుకోవడం కోసం ఏన్నో రకాల ప్రోడెక్ట్స్‌ని వాడుతూ ఉంటారు. అయితే వీటితో తాత్కాలికమైన పైపైనే మెరుపులే. కానీ చర్మం లోపలి నుంచి క్లీన్‌గా ఉంటే.. ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో కోసం మంచి ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారమే..

అందంగా కనిపించాలని మహిళలు, పురుషులు తెగ ప్రయాస పడుతూ ఉంటారు. అందులోనూ యంగ్ ఏజ్‌లో ఉండే అబ్బయిలు, అమ్మాయిల సంగతి అయితే అసలు చెప్పాల్సిన పని లేదు. అందాన్ని మెరిపించుకోవడం కోసం ఏన్నో రకాల ప్రోడెక్ట్స్‌ని వాడుతూ ఉంటారు. అయితే వీటితో తాత్కాలికమైన పైపైనే మెరుపులే. కానీ చర్మం లోపలి నుంచి క్లీన్‌గా ఉంటే.. ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఇందులో కోసం మంచి ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారమే.. మీరు అందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మీరు అందంగా ఉండేందుకు ‘విటమిన్ ఇ’ ఆహారం బాగా సహాయ పడుతుంది. విటమిన్ ఇ ఉండే ఆహారాలు కూడా మీ డైట్‌లో తీసుకోవడం వల్ల చర్మం లోపలి నుంచి కాంతి వంతంగా తయారవుతుంది. దీంతో మీరు పెద్దగా ఎలాంటి ప్రోడెక్ట్స్ ఉపయోగించాల్సిన పని లేదు. మరి విటమి ఇ ఎక్కువగా లభింతే ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వేరు శనగలు:
వీటిని పల్లీలు అని కూడా అంటారు. ఈ వేరు శనగ గింజల్లో విటమిన్ అనేది లభిస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల చర్మంపై మెరుపును తీసుకొస్తుంది. అంతే కాకుండా ముడతలు తగ్గిస్తుంది. అలాగే పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
బాదం:
మీకు ఎక్కువగా లభించే వాటిల్లో బాదం పప్పు కూడా ఒకటి. బాదంలో విటమిన్ ఇ అనేది మెండుగా ఉంటుంది. బాదంను నానబెట్టి ప్రతి రోజూ తింటే మంచి ఆరోగ్యమైన స్కిన్ మీ సొంతం అవుతుంది. అలాగే బాదం ఆయిల్ చర్మంపై రాసుకున్నా.. మంచి కాంతి వంతమైన చర్మం పొందుతారు. అదే విధంగా రోజూ బాదం తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
అవకాడో:
రోజూ మీ డైట్‌లో కొద్ది మొత్తంలో అయినా అవకాడోను తీసుకుంటే.. చర్మం, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ, ఏ, సిలు లభిస్తాయి. ఈ విటమిన్స్ శరీరానికి బాగా పని చేస్తాయి. అవకాడో తీసుకుంటే.. మీ స్కిన్ గ్లోయింగ్ అవుతుంది.
బ్రోకలీ:
బ్రోకలీ తిన్నా మీ స్కిన్ లోపలి నుంచి గ్లో అవుతుంది. ఇందులో కూడా విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. తరచూ బ్రోకలీ తింటే.. మీ చర్మం లోపల నుంచి కాంతి వంతంగా తయారవుతుంది. ముడతలు, మొటిమలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో మెండుగా ఉంటాయి. బ్రోకలీ తింటే స్త్రీల యోనిలో వచ్చే ఇన్ ఫెక్షన్ తగ్గుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.




