Clove for Diabetes: లవంగంతో షుగర్ వ్యాధిని ఎలా తగ్గించుకోవచ్చంటే..

|

Jul 07, 2024 | 4:18 PM

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్‌తో బాధ పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకుంటే.. ఆరోగ్యంగా, అందంగా ఉండొచ్చు. మనం ఇంట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో ఎన్నో రకాల రోగాలను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా చాలా వ్యాధులను ఇంటి చిట్కాలతోనే నయం చేసేవారు. డయాబెటీస్‌ను కంట్రోల్ చేయడానికి ఇప్పటికే ఎన్నో రకాల చిట్కాలు..

Clove for Diabetes: లవంగంతో షుగర్ వ్యాధిని ఎలా తగ్గించుకోవచ్చంటే..
Diabetes
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్‌తో బాధ పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకుంటే.. ఆరోగ్యంగా, అందంగా ఉండొచ్చు. మనం ఇంట్లో నిత్యం ఉపయోగించే మసాలా దినుసులతో ఎన్నో రకాల రోగాలను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో కూడా చాలా వ్యాధులను ఇంటి చిట్కాలతోనే నయం చేసేవారు. డయాబెటీస్‌ను కంట్రోల్ చేయడానికి ఇప్పటికే ఎన్నో రకాల చిట్కాలు తెలుసుకున్నారు. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి మన వంటింట్లో ఉండే లవంగాలు కూడా సహాయ పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు లవంగాలతో డయాబెటీస్‌ను ఎలా తగ్గించుకోవచ్చు? షుగర్ పేషెంట్లు లవంగాలు తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఔషధ గుణాలు మెండు:

లవంగాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, ఫైబర్ వంటివి లభిస్తాయి. వీటిల్లో మాంగనీస్, విటమిన్లు కెలు కూడా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయి. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. వీటి వలన చాలా సమస్యలు కంట్రోల్ అవుతాయి.

ఒత్తిడిని తగ్గిస్తుంది:

లవంగాలను మీ డైట్‌లో చేర్చు కోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన కారణంగా కూడా డయాబెటీస్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి వల్ల కేవలం డయాబెటీస్ మాత్రమే కాకుండా చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి లవంగాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి కంట్రోల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

షుగర్ ఉన్నవాళ్లు లవంగాలను ఎలా తీసుకోవాలి:

డయాబెటీస్ పేషెంట్లు లవంగాలను తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ల లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అయితే లవంగాలను ఎలా తీసుకోవాలి అనే సందేహం వచ్చే ఉంటుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు నీటిలో 8 నుంచి 10 లవంగాలను బాగా మరిగించి వడకట్టి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా మూడు నెలలు ఈ డ్రింక్ తాగితే.. మంచి ఫలితాలు మీకే కనిపిస్తాయి. అదే విధంగా తీసుకునే ఆహారం కూడా అదుపులో ఉండాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..