అల్యూమినియం ఫాయిల్ వాడుతున్నారా..? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!
ఇంట్లో వంటలో అల్యూమినియం ఫాయిల్ ఎక్కువగా ఉపయోగిస్తాం. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడటం సాధారణం. కానీ ఫాయిల్ శుభ్రంగా ఉండకపోతే.. లేదా దెబ్బతిన్నట్లయితే ఆరోగ్య సమస్యలు రావచ్చు. అల్యూమినియం ఫాయిల్ సురక్షితంగా మళ్ళీ వాడే చిట్కాలు, జాగ్రత్తలు, శుభ్రం చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Aluminium Foil
మనం వంటగదిలో అల్యూమినియం ఫాయిల్ చాలా ఎక్కువగా వాడతాం. ఒకసారి వాడిన ఫాయిల్‌ను మళ్ళీ మళ్ళీ వాడుతుంటాం. కానీ అలా చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. అల్యూమినియం ఫాయిల్‌ను ఒక్కసారి వాడిన తర్వాత మళ్ళీ వాడవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ఫాయిల్‌పై ఆహార పదార్థాలు అంటుకొని ఉండకూడదు. ఆహారం మిగిలి ఉంటే దాన్ని మళ్ళీ వాడకండి.
- ఒకవేళ ఫాయిల్ రంగు మారినా.. కొద్దిగా ముడతలు పడినా దానిని మళ్ళీ వాడటంలో ఎలాంటి సమస్య ఉండదు.
శుభ్రపరిచే పద్ధతి
- వాడిన ఫాయిల్‌ను సబ్బు, నీటితో శుభ్రం చేయవచ్చు.
- కొన్ని సందర్భాల్లో శుభ్రం చేయకుండా కూడా మళ్ళీ వాడవచ్చు.
ఎప్పుడు పడేయాలి..?
- ఫాయిల్ పూర్తిగా ముడతలు పడితే.
- చిరిగిపోయినా, దెబ్బతినినా పడేయడం మంచిది.
అల్యూమినియం ఫాయిల్‌ను మళ్ళీ వాడేటప్పుడు అది పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పూర్తిగా పాడైతే పడేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.




