Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine Week: లవర్ లేదని దిగులుపడుతున్నారా? నో ప్రాబ్లమ్.. సోలో లైఫ్ సో బెటర్.. ఆ రోజు ఇలా ప్లాన్ చేసుకోండి..!!

Valentine's Day 2023: ప్రేమికుల రోజు వచ్చేస్తోంది. లవర్ లేదని సింగిల్‎గా ఉన్నామని కొంతమంది పడే బాధ వర్ణాతీతం. నాకు లవర్ లేదు కదా అంటూ బాధపడుతుంటారు.

Valentine Week: లవర్ లేదని దిగులుపడుతున్నారా? నో ప్రాబ్లమ్.. సోలో లైఫ్ సో బెటర్.. ఆ రోజు ఇలా ప్లాన్ చేసుకోండి..!!
Representative ImageImage Credit source: TV9 Telugu
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 09, 2023 | 6:33 PM

ప్రేమికుల రోజు వచ్చేస్తోంది. లవర్ లేదని సింగిల్‎గా ఉన్నామని కొంతమంది పడే బాధ వర్ణాతీతం.ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు తనకు  లవర్ లేదు కదా అంటూ బాధపడుతుంటారు. కొందరు ఇదే ఆలోచనలతో మానసిక కుంగుబాటుకు గురవుతుంటారు.  కానీ ప్రేమించి తెచ్చుకునే తంటాల కంటే …లవర్ లేకుంటే హ్యాపీగా ఉండవచ్చు. ఒంటరిగా ఉన్నామని బాధపడకుండా ప్రేమికుల రోజు ఆనందంగా ఉండేందుకు కొన్ని ప్లాన్స్ వేసుకుంటే చాలు. సింగిల్‎గా ఉన్నా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.

ప్రేమికుల రోజు అంటే ..ఫ్యామిలీ, ఫ్రెండ్స్ పట్ల ప్రేమను ముఖ్యంగా మన మీద మనం ప్రేమను కూడా చూపించుకోవచ్చు. ప్రేమికుల రోజును కేవలం జంటల కోసమే ప్రత్యేకంగా ఉద్దేశించిది కాదు. ఒంటరిగా ఉన్నవారు ఆరోజును సెలబ్రేట్ చేసుకోకూడదని ఎక్కడా రాసి లేదు. మిమ్మల్ని మీరు అన్వేషించడానికి ఒక గొప్పరోజు అనుకోవడంలో తప్పులేదు. మన జీవితంలో చాలామంది ఉన్నారు. ఫ్యామిలీ కావచ్చు, స్నేహితులు కావచ్చు …వారితో ఆ రోజు గడిపేలా ప్లాన్ చేయండి. ఒకవేళ మీరు ఆ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచించినట్లయితే..మీకోసం కొన్ని టిప్స్ ఇస్తున్నాం.. అవి ఫాలో అవ్వండి.

సోలో లైఫ్‌ సో బెటర్..

  1. ఒంటరిగా ఉండటం గురించి మీకు ఎలా అనిపించినా…అందులో ఎలాంటి తప్పులేదని గుర్తుంచుకోండి.
  2. మీ హాబీలు, అభిరుచిపై దృష్టి పెట్టండి. ఇది మీ వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మీరు ఒంటరిగా ఎందుకు ఉన్నామనే కారణాన్ని తెలుసుకోండి. దీనికి సహేతుక కారణాలు ఉండొచ్చు.
  5. మీకు ఎలాంటి పనులు చేస్తే సంతోషాన్ని ఇస్తాయో ఆ పనులపై దృష్టి పెట్టండి. అది హాబీ కావచ్చు లేదా స్నేహితులతో గడపడం కావచ్చు.
  6. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకోండి. వారితో మరింత సన్నిహితంగా ఉండేందుకు మీకు ఇది చక్కటి అవకాశాన్ని ఇస్తుంది.
  7. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకచోటకు రప్పించి…వారికి పార్టీ ప్లాన్ చేయండి. మీ గెస్టులకు నచ్చిన వంటకాలను వండి వడ్డించండి. తింటూ ఎన్నో ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ లభించే ఆనందం మరెక్కడా దొరకదు.
  8. మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లండి. ఇంట్లో వాళ్లంత ప్లాన్ చేసుకుని పిక్నిక్‌కు వెళ్తే ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్  చేయండి..