AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే.. మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు..

పండుగల వేళ గుమ్మాలకు బంతిపూల తోరణాలు కడితే ఆ అందమే వేరు.. అయితే ఇంట్లో ఎంతో ముచ్చటపడి నాటిన బంతి మొక్కకు పూలు సరిగ్గా పూయడం లేదా? ఆకులు ఏపుగా పెరిగి మొగ్గలు రాలడం లేదా చిన్నగా పూస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన ఎరువులతో మీ బంతి మొక్కలు గుత్తులు గుత్తులుగా కళకళలాడేలా ఎలా మార్చవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే.. మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు..
How To Get Maximum Flowers On Marigold Plants
Krishna S
|

Updated on: Sep 18, 2026 | 1:32 PM

Share

పండుగలు, శుభకార్యాలు, పూజలు ఏవైనా సరే.. బంతి పువ్వులు లేనిదే అలంకరణ పూర్తికాదు. గుమ్మాలకు కట్టే తోరణాల నుంచి దేవుడి పటాల వరకు బంతి పువ్వుల పసుపు, నారింజ రంగులు ఇంటికే సరికొత్త శోభను తెచ్చిపెడతాయి. అందుకే చాలామంది తమ ఇళ్లలో, బాల్కనీలలో బంతి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. అయితే ఎంతో ఆశగా నాటిన మొక్కకు సరిగ్గా పూలు పూయకపోవడం, పూసినా చిన్నగా ఉండటం చాలామందిని నిరాశకు గురిచేస్తుంది. సరైన పోషణ, కొన్ని సహజసిద్ధమైన ఎరువులతో పాటు చిన్నపాటి మెలకువలు పాటిస్తే బంతి మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూసేలా చేయవచ్చు.

సహజసిద్ధమైన పోషణ: బంతి మొక్కకు బలాన్నిచ్చే ఎరువులు

ఆవపిండి ద్రావణం : మొక్కలకు ఆవపిండి అద్భుతమైన సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. ఆవపిండి లేదా దాని పొడిని నీటిలో కొన్ని రోజుల పాటు నానబెట్టి, పులియబెట్టిన తర్వాత ఆ ద్రావణాన్ని పలుచగా చేసి వడకట్టాలి. ఈ ద్రావణాన్ని జాగ్రత్తగా మొక్కల మట్టికి అందిస్తే వేర్లు దృఢపడి మొగ్గలు బాగా వస్తాయి. అయితే ఈ గాఢ ద్రావణాన్ని నేరుగా వేర్ల మొదట్లో పోయకుండా పక్కగా అందించడం మంచిది.

వర్మీకంపోస్ట్‌తో దీర్ఘకాలిక పోషణ: బంతి మొక్కల కుండీల్లోని పైమట్టిని కొద్దిగా వదులు చేసి, బాగా తయారైన వర్మీకంపోస్ట్‌ను కలపాలి. ఇది నేల నాణ్యతను పెంచి, మొక్కకు అవసరమైన పోషకాలను నిరంతరం అందిస్తూ ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది.

అరటి తొక్కల ద్రావణం: అరటి తొక్కలను నీటిలో నానబెట్టి తయారుచేసిన నీటిని మొక్కలకు పోయడం ద్వారా కొంతమేర పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు అందుతాయి. అయితే దీని ప్రభావం పరిమితంగానే ఉంటుంది కాబట్టి, ఇతర సేంద్రియ ఎరువులతో కలిపి సమతుల్యంగా వాడటం ఉత్తమం.

ఎక్కువ పూలు పూయాలంటే నివారించాల్సిన మూడు తప్పులు

వాడిపోయిన పువ్వులను మొక్కపైనే ఉంచడం: మొక్కపై ఎండిపోయిన, వాడిపోయిన పువ్వులు అలాగే ఉంటే అవి విత్తనాల తయారీపై దృష్టి పెట్టి, కొత్త మొగ్గలు రావడాన్ని అడ్డుకుంటాయి. కాబట్టి వాడిన పువ్వులను ఎప్పటికప్పుడు శుభ్రమైన కత్తెరతో కత్తిరించాలి. దీనివల్ల మొక్కకు కొత్త శాఖలు వచ్చి పూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది.

ఎండ సరిగ్గా తగలకపోవడం: బంతి మొక్కలకు ప్రత్యక్ష సూర్యరశ్మి ప్రాణాధారం. కుండీలను నీడపట్టున ఉంచితే మొక్క ఆకులతో పచ్చగా ఏపుగా పెరుగుతుందే తప్ప మొగ్గలు వేయదు. రోజూ కనీసం కొన్ని గంటల పాటు పుష్కలంగా ఎండ తగిలే చోట కుండీలను ఉంచాలి.

అధిక నైట్రోజన్ వాడకం: కేవలం ఆకుల పచ్చదనం పెంచే నత్రజని శాతం ఎక్కువగా ఉండే ఎరువులను వాడితే మొక్క పువ్వుల కంటే ఆకుల మీదే ఎక్కువ శక్తిని కేంద్రీకరిస్తుంది. అందుకే పువ్వులు పూసే దశలో సమతుల్యమైన ఎరువులను మాత్రమే అందించాలి.

ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. రాబోయే పండుగల నాటికి మీ ఇంటి ప్రాంగణంలోని బంతి మొక్కలు పూలతో కళకళలాడుతూ ఇంటికి పండుగ శోభను తీసుకువస్తాయి.

Follow Us
జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే..
జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే..
ఏపీలో సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఏపీలో సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్
21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్
భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు?
భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు?
డీజేలో మోత మోగిపోతున్న సాంగ్.. కుర్రాళ్లకు ఫుల్ జోషిస్తున్న పాట..
డీజేలో మోత మోగిపోతున్న సాంగ్.. కుర్రాళ్లకు ఫుల్ జోషిస్తున్న పాట..
మరణానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయా? శరీరంలో జరిగే మార్పులివే!
మరణానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయా? శరీరంలో జరిగే మార్పులివే!