Zero Balance Account: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఈ బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు.. నో ఛార్జెస్
Zero Balance Savings Account: మీకు ఇప్పటికే ఏదైనా బ్యాంక్‌లో సాధారణ సేవింగ్స్ ఖాతా ఉంటే, దానిని కూడా సులభంగా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాగా మార్చుకునే అవకాశం ఉంది. దీని కోసం మీ బ్యాంక్ శాఖకు వెళ్ళి అభ్యర్థన దాఖలు చేస్తే..

Zero Balance Savings Account: బ్యాంక్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ (Minimum Balance) మైంటైన్ చేయలేదని ప్రతి నెలా మీ ఖాతా నుండి డబ్బులు కట్ అవుతున్నాయా? ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేని, ఉచిత సదుపాయాలు ఇచ్చే బ్యాంక్ ఖాతా కోసం చూస్తున్నారా? అయితే భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) అందించే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతా మీకోసమే.
సామాన్య ప్రజలకు ఉచితంగా, అందుబాటు ధరల్లో బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఆర్బీఐ ఈ BSBD ఖాతాలను అందుబాటులోకి తెచ్చింది.
ఇది కూడా చదవండి: Ration Card: రేషన్‌కార్డు ఉన్న వారికి బిగ్ షాక్.. వీరి రేషన్ నిలిపివేత..!
BSBD ఖాతాలోని ముఖ్య ప్రయోజనాలు:
- మినిమం బ్యాలెన్స్ శూన్యం: ఈ ఖాతాలో రూపాయి కూడా ఉంచాల్సిన అవసరం లేదు (Zero Balance). దీనికి ఎలాంటి పెనాల్టీలు ఉండవు.
- డిపాజిట్లపై పరిమితి లేదు: ఈ ఖాతాలో ఒక నెలలో ఎన్నిసార్లైనా డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు.
- ఉచిత ఏటీఎం/డెబిట్ కార్డ్: ఎటువంటి వార్షిక రుసుము లేకుండానే ఏటీఎం కార్డ్‌ను పొందవచ్చు.
- ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్: డిజిటల్ లావాదేవీల కోసం మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉచితంగా లభిస్తుంది.
- పాస్‌బుక్, చెక్‌బుక్: ఉచిత పాస్‌బుక్‌తో పాటు అవసరమైన వారికి ఉచిత చెక్‌బుక్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
- నెలలో 4 ఉచిత విత్‌డ్రాయల్స్: నెలకు కనీసం 4 ఉచిత నగదు ఉపసంహరణల (Cash Withdrawals/ATM) సదుపాయం ఉంటుంది.
సాధారణ ఖాతా నుంచి BSBDకి ఎలా మారాలి?
మీకు ఇప్పటికే ఏదైనా బ్యాంక్‌లో సాధారణ సేవింగ్స్ ఖాతా ఉంటే, దానిని కూడా సులభంగా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాగా మార్చుకునే అవకాశం ఉంది. దీని కోసం మీ బ్యాంక్ శాఖకు వెళ్ళి అభ్యర్థన దాఖలు చేస్తే సరిపోతుంది. అయితే, ఒకే బ్యాంక్‌లో ఒకే వ్యక్తికి సాధారణ సేవింగ్స్ ఖాతా BSBD ఖాతా రెండూ ఉండటానికి వీల్లేదు. BSBD ఖాతా ఓపెన్ చేసిన 30 రోజుల్లోగా పాత సాధారణ ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది. దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి. మినిమం బ్యాలెన్స్ భయం లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందాలనుకునే వారికి బీఎస్‌బీడీ అత్యుత్తమ ఎంపిక.
ఇది కూడా చదవండి: Business Ideas: కేవలం రూ.5 వేలతో మీ జీవితాన్ని మార్చే బిజినెస్ గురించి మీకు తెలుసా?
ఇది కూడా చదవండి: బంగారం ధరలు పెరిగినా తక్కువ ధరల్లో జ్యువెలరీస్ కొనడం ఎలాగో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




