AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!

విరాట్ కోహ్లీ.. జో రూట్.. ఆధునిక క్రికెట్‌ను శాసిస్తున్న ఇద్దరు బ్యాటింగ్ దిగ్గజాలు. ఇప్పటిదాకా వీరి బ్యాటింగ్ గణాంకాలపైనే లెక్కలేసుకున్న క్రికెట్ పండితులు.. ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీ రికార్డులపై చర్చ మొదలుపెట్టారు. పాకిస్థాన్‌పై గెలుపుతో జో రూట్ టెస్టు సారథిగా సరిగ్గా 68వ మ్యాచ్‌ను ముగించాడు. విచిత్రమేమిటంటే టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సైతం నడిపించింది సరిగ్గా 68 టెస్టులనే.. ఆ వివరాలను ఆ స్టోరీలో తెలుసుకుందాం..

కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
Virat Kohli Vs Joe Root Test Captaincy
Krishna S
|

Updated on: Sep 18, 2026 | 1:25 PM

Share

క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ, జో రూట్ పేర్లు ఎప్పుడూ చర్చనీయాంశమే. బ్యాటింగ్‌లో వీరు సృష్టించిన రికార్డులపై నిత్యం పోలికలు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా టెస్ట్ కెప్టెన్సీ విషయంలోనూ ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య సరికొత్త పోలిక తెరపైకి వచ్చింది. పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో.. జో రూట్ టెస్టుల్లో సారథిగా తన 68వ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. విశేషమేమిటంటే.. 2022లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సరిగ్గా 68 టెస్టులకే సారథ్యం వహించాడు. సమాన సంఖ్యలో మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన నేపథ్యంలో, టెస్ట్ సారథిగా వీరిలో ఎవరు బెస్ట్ అనే చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది.

గణాంకాల్లో కోహ్లీదే తిరుగులేని ఆధిపత్యం

మ్యాచ్‌ల సంఖ్య ఒక్కటే అయినప్పటికీ, విజయాల శాతం పరంగా కోహ్లీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. 68 టెస్టుల్లో భారత్‌ను నడిపించిన విరాట్.. ఏకంగా 40 విజయాలు సాధించి, 17 ఓటములు, 11 డ్రాలతో 58.82శాతం విన్నింగ్ పర్సంటేజీని నమోదు చేశాడు. భారత టెస్ట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సారథిగా నిలిచాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్‌గా 68 మ్యాచ్‌ల్లో రూట్ 30 విజయాలు, 27 ఓటములు, 11 డ్రాలతో 44.1శాతం గెలుపు శాతాన్ని కలిగి ఉన్నాడు. ముఖాముఖి పోరులో మాత్రం ఈ ఇద్దరు దిగ్గజాలు చెరో 6 విజయాలతో సమవుజ్జీలుగా నిలిచారు.

ఇంగ్లాండ్ రికార్డుల్లో జో రూట్ చరిత్ర

అలిస్టర్ కుక్ తర్వాత 2017లో పగ్గాలు చేపట్టిన జో రూట్.. 2022 వరకు 64 టెస్టులకు సారథ్యం వహించి 27 విజయాలు అందించాడు. అనంతరం బెన్ స్టోక్స్ సస్పెన్షన్, రిటైర్మెంట్ పరిణామాలతో ఈ ఏడాది మళ్లీ శాశ్వత కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా సాధించిన విజయంతో మొత్తం 30 గెలుపులను ఖాతాలో వేసుకున్న రూట్.. మైకేల్ వాన్ (26 విజయాలు) రికార్డును అధిగమించి ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టు విజయాలు అందించిన సారథిగా చరిత్ర సృష్టించాడు. కెప్టెన్సీ ఒత్తిడిలోనూ దాదాపు 47 సగటుతో పరుగులు రాబట్టడం అతనిలోని అద్భుత నిలకడకు నిదర్శనం.

టెస్ట్ క్రికెట్‌ను శాసించిన కోహ్లీ శకం

మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తర్వాత 2014లో టెస్ట్ పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ.. భారత జట్టు రూపురేఖలనే మార్చేశాడు. స్వదేశంలో ఆడిన మొత్తం 11 టెస్ట్ సిరీస్‌లలోనూ భారత్‌ను అజేయంగా నిలిపాడు. అంతేకాకుండా 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా రికార్డుకెక్కాడు. 2016 నుంచి 2021 వరకు వరుసగా ఐదేళ్లపాటు టీమిండియాను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో నిలిపిన ఘనత కోహ్లీకే దక్కుతుంది. భారత్‌ను తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చడంతో పాటు, సారథిగా అత్యధికంగా ఏడు డబుల్ సెంచరీలు బాదిన రికార్డునూ సొంతం చేసుకున్నాడు.

మొత్తంగా చూస్తే.. గణాంకాలు, విజయాల పరంగా కోహ్లీ రికార్డు తిరుగులేనిదిగా నిలిస్తే.. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా జో రూట్ తనదైన ముద్ర వేశాడు. 2025లో కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలకడంతో అతని రికార్డులు అక్కడితో ఆగగా, ప్రస్తుతం మళ్లీ పగ్గాలు అందుకున్న జో రూట్‌కు టెస్టుల్లో తన విజయాల సంఖ్యను మరింత పెంచుకునే అవకాశం మిగిలి ఉంది.

Follow Us
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్
21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్
భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు?
భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు?
డీజేలో మోత మోగిపోతున్న సాంగ్.. కుర్రాళ్లకు ఫుల్ జోషిస్తున్న పాట..
డీజేలో మోత మోగిపోతున్న సాంగ్.. కుర్రాళ్లకు ఫుల్ జోషిస్తున్న పాట..
మరణానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయా? శరీరంలో జరిగే మార్పులివే!
మరణానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయా? శరీరంలో జరిగే మార్పులివే!
కేవలం రూ.51కే అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్
కేవలం రూ.51కే అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్
కొడుకు కొడుతున్నాడని పోలీసులకు ఫోన్ చేసిన తల్లి.. కట్‌చేస్తే
కొడుకు కొడుతున్నాడని పోలీసులకు ఫోన్ చేసిన తల్లి.. కట్‌చేస్తే