Summer Tips: ఏసీ లేకుండానే కూల్‌ కూల్‌.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు.

అయితే కూలర్స్‌ వరకు అయితే ప్రతీ ఒక్కరూ ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఏసీలను మాత్రం అందరూ పెట్టుకోవడం అంత సులభమైన విషయం కాదనే చెప్పాలి. అలాగే మరికొందరి ఇళ్లలో కూలర్స్‌ కూడా ఉండవు. అవన్నీ పక్కన్న పెడితే కొన్ని సందర్భాల్లో కరెంట్ కూడా ఉండదు. మరి అలాంటి సమయాల్లో ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Summer Tips: ఏసీ లేకుండానే కూల్‌ కూల్‌.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు.
Summer Tips
Follow us

|

Updated on: May 07, 2024 | 2:15 PM

ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది కూడా అవ్వకముందే ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇంటి నుంచి బయటకు రావడం మాత్రమే కాదు. ఇంట్లో కూర్చున్నా వేడికి తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. భానుడి భగభగలకు తట్టుకోలేక చాలా మంది ప్రజలు ఇంట్లో కూలర్స్‌ను, ఏసీలను వాడుతున్నారు.

అయితే కూలర్స్‌ వరకు అయితే ప్రతీ ఒక్కరూ ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇక ఏసీలను మాత్రం అందరూ పెట్టుకోవడం అంత సులభమైన విషయం కాదనే చెప్పాలి. అలాగే మరికొందరి ఇళ్లలో కూలర్స్‌ కూడా ఉండవు. అవన్నీ పక్కన్న పెడితే కొన్ని సందర్భాల్లో కరెంట్ కూడా ఉండదు. మరి అలాంటి సమయాల్లో ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లోకి వేడి గాలి రాకుండా కిటీకీలకు డార్క్‌ కర్టెన్స్‌ను ఉపయోగించాలి. వీటివల్ల అద్దాలపై రిఫ్లక్ట్‌ అయిన ఎండ వేడి ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఇక మీరు ఇంట్లో ఒకవేళ టేబుల్‌ ఫ్యాన్‌ ఉపయోగిస్తుంటే ఆ ఫ్యాన్‌ ముందు కొన్ని మంచు గడ్డలను ఒక పాత్రలో వేసి ఉంచండి ఇలా చేయడం వల్ల ఫ్యాన్‌ నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది. ఇక ఇంట్లో ఉపయోగించే బల్బులు కూడా వేడికి కారణమవుతాయి. ఎర్రటి బల్బులకు బదులుగా తెల్లటి ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించాలి. వీటివల్ల ఇంట్లో వేడి లేకుండా ఉంటుంది.

రాత్రుళ్లు కిటీకీలకు, తలుపులను పూర్తిగా తెరిచిపెట్టాలి. ఒకవేళ దోమలు వస్తాయనే ఆలోచన ఉంటే నెట్‌లను ఉపయోగించాలి. రాత్రిపూట సహజంగా వచ్చే చల్లటి గాలి ఇంట్లోకి వస్తే గది కూల్‌గా మారుతుంది. ఇక వంటింట్లో ఉన్న సమయంలో కచ్చితంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉపయోగించాలి వీటివల్ల వేడి గాలి బయటకు వెళ్లిపోతుంది. ఇక ఇంట్లో చెట్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా గదిని కూల్‌గా ఉంచుకోవచ్చు. కొన్ని రకాల మొక్కలు చుట్టుపక్కల గాలిని చల్లబరుస్తాయి. ఇంటిని ఏసీ లేకున్నా కూల్‌గా ఉంచే వాటిలో పెయింట్ ముఖ్యమైంది. ముఖ్యంగా బిల్డింగ్స్‌లో పైన ఫ్లోర్‌లో ఉన్న వారికి వేడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు టెర్రస్‌పై కూలింగ్ పెయింట్ వేసుకుంటే గదిలో చల్లగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..