మురికి పట్టిన పూజా సామాగ్రి కొత్తవిగా మెరవాలంటే…ఈ మూడు పదార్థాలుంటే చాలు!
దీపావళి సమయంలో ధంతేరస్ లేదా లక్ష్మీ పూజ రోజున మనకు దీపాలు అవసరం. అలాగే, పిండి వంటకాల కోసం కూడా ఇత్తడి, రాగి అచ్చు అవసరం. కాబట్టి కష్టపడక తప్పదు.. కానీ ఏడాది పొడవునా దానిపై పేరుకుపోయే దుమ్ము కారణంగా దాని మెరుపు మసకబారుతుంది. ఇందుకోసం కూడా మీరు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.. అందుకే మీరు కొన్ని సాధారణ ఉపాయాలు ఉపయోగిస్తే, రాగి, ఇత్తడి పాత్రలు కొత్తవిలా మెరుస్తాయి.

హిందూ మతంలో అన్ని పండుగులే.. ఈ పండుగ సమయంలో ఇంటిని శుభ్రపరచడం, అలంకరించడం మరో ప్రత్యేకం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి వేడుకలకు సిద్ధమవుతున్నారు. దీపావళికి ముందే ప్రజలంతా ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో బాల్కనీలో లేదా ఇంటి ఇతర మూలల్లో పాత రాగి, ఇత్తడి పాత్రలను ఏర్పాటు చేయడం చూస్తుంటాం. మనం సాధారణంగా ఈ పాత్రలను ఉపయోగించము ఎందుకంటే వాటిని శుభ్రం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని.. ఇందుకోసం చాలా బలం ఉపయోగించాల్సి ఉంటుంది.
కానీ, దీపావళి సమయంలో ధంతేరస్ లేదా లక్ష్మీ పూజ రోజున మనకు దీపాలు అవసరం. అలాగే, పిండి వంటకాల కోసం కూడా ఇత్తడి, రాగి అచ్చు అవసరం. కాబట్టి కష్టపడక తప్పదు.. కానీ ఏడాది పొడవునా దానిపై పేరుకుపోయే దుమ్ము కారణంగా దాని మెరుపు మసకబారుతుంది. ఇందుకోసం కూడా మీరు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.. అందుకే మీరు కొన్ని సాధారణ ఉపాయాలు ఉపయోగిస్తే, రాగి, ఇత్తడి పాత్రలు కొత్తవిలా మెరుస్తాయి.
సాధారణంగా అందరూ ఇత్తడి లేదా రాగి పాత్రలను రుద్దడానికి సబ్బును ఉపయోగిస్తుంటారు. కానీ అది మన చేతులకు హాని కలిగిస్తుంది. ఇది తరచుగా చర్మ వ్యాధులకు కారణమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి రాగి పాత్రలను శుభ్రం చేయడానికి, వాటిని నిమ్మ తొక్కతో రుద్దండి. అందులోని ఆమ్లాలు పాత్రలు మెరిసేలా చేస్తాయి.
రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి మనం నిమ్మకాయ, ఉప్పును కూడా ఉపయోగించవచ్చు. దీనికి బేకింగ్ సోడాను కూడా కలపడం వల్ల పాత్రలు కొత్త వాటిలా మెరుస్తాయి. ఉప్పులో సోడియం, నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అనే రసాయనాల కలయిక ఈ పసుపు ప్రాంతాన్ని శుభ్రంగా, మెరిసేలా చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








