AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Muskmelon: ఖర్భూజా కొనేటప్పుడు మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? నకిలీ రాయుళ్లతో జాగ్రత్త..

పుచ్చకాయ లాగే ఖర్బూజా కూడా అధిక పోషకాలు కలిగి ఉంటుంది. ఈ పండులో 90 నుండి 92% నీటి శాతం ఉంటుంది. కాబట్టి జ్యూస్ చేయడానికి కూడా దీనిని ఎక్కువగా ఎంచుకుంటారు. మార్కెట్ నుంచి తెచ్చే ఖర్బూజా పండ్లు ఒక్కోసారి తీపిగా ఉండవు. అయితే కొనుగోలు చేసేటప్పుడే..

Muskmelon: ఖర్భూజా కొనేటప్పుడు మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? నకిలీ రాయుళ్లతో జాగ్రత్త..
Muskmelon
Srilakshmi C
|

Updated on: Apr 07, 2025 | 8:52 PM

Share

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి పండ్ల రసాలు, పండ్లను సాధారణంగా తీసుకుంటూ ఉంటాం. జనాలు ఎక్కువగా నారింజ, పుచ్చకాయ, ఖర్బూజా, మామిడి వంటి మొదలైన పండ్లను మార్కెట్లో కొంటుంటారు. ముఖ్యంగా వేడి వాతావరణంలో ఖర్బూజా అధిక డిమాండ్ ఉంటుంది. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ జనాలు వాటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. పుచ్చకాయ లాగే ఖర్బూజా కూడా అధిక పోషకాలు కలిగి ఉంటుంది. ఈ పండులో 90 నుండి 92% నీటి శాతం ఉంటుంది. కాబట్టి జ్యూస్ చేయడానికి కూడా దీనిని ఎక్కువగా ఎంచుకుంటారు. మార్కెట్ నుంచి తెచ్చే ఖర్బూజా పండ్లు ఒక్కోసారి తీపిగా ఉండవు. అయితే కొనుగోలు చేసేటప్పుడే తీపి ఖర్బూజాను ఎంచుకోవాలి. కానీ పండిన, రుచికరమైన, తియ్యటి పుచ్చకాయను ఎంచుకోవడం ఎలాగో చాలా మందికి తేలియదు. ఈ కింది చిట్కాల ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు..

పండిన, తీపి ఖర్బూజా కాయను ఎలా ఎంచుకోవాలంటే..

  • సహజంగా పండిన పుచ్చకాయను ఎంచుకోవాలి. పండిన పండ్లు తియ్యగా ఉంటాయి.
  • ముందుగా, ఒక ఖర్బూజా కాయ అడుగు భాగాన్ని వాసన చూచాలి. అది తీపి పండ్ల వాసన కలిగి ఉంటే, ఆ ఖర్బూజా పూర్తిగా తీపిగా ఉందని అర్థం.
  • ఖర్బూజా కాయ పండిందో లేదో మీరు మీ వేలితో నొక్కడం ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. మీరు మీ వేలితో నొక్కిన పండు గట్టిగా లేకుండా కొంచెం మృదువుగా, మెత్తగా ఉంటే అది పూర్తిగా పండిందని అర్థం. అలాకాకుండా నొక్కినప్పుడు పండు చాలా మృదువుగా ఉంటే అది ఎక్కువగా పండిందని లేదంటే లోపల కుళ్ళిపోయి ఉందని అర్ధం.
  • మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఖర్బూజా కాయను కొనుగోలు చేసేటప్పుడు దానిపై వల ఆకారపు గుర్తులు చూడాలి. ఈ గుర్తులు లోతుగా, ఏకరీతిగా ఉంటే పండు పూర్తిగా పండిందని అర్థం.
  • ఖర్బూజా కాయ కొనేటప్పుడు దాని రంగును బట్టి కూడా అది పండిందో లేదో తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ బంగారు పసుపు రంగులోకి మారిన ఖర్బూజా కాయలను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ రంగులో ఉండే పండు పూర్తిగా పండి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో