అందమైన ఎర్రటి పెదాల కోసం.. కెమికల్స్ లేని న్యాచురల్ లిప్‌స్టిక్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి
Homemade Lipstick: ప్రస్తుత రోజులు ఎలా మారిపోయాయి అంటే మేకప్ లేకుండా ఎవరూ బయటకి రావడానికి ఇష్టపడట్లేదు. అందంగా కనిపించాలని ఖరీదైన మేకప్ కిట్స్ ఉపయోగిస్తున్నారు. ఇక ఇందులో పెదాల కోసం మరింత ప్రత్యేకంగా లిప్‌స్టిక్స్ కొంటున్నారు. కానీ మార్కెట్‌లో దొరికేవన్ని రసాయనాలతో తయారు చేస్తారు. కాబట్టి అవి మనకు హానికరం కావచ్చు. అందులో ఇంట్లోనే న్యాచురల్‌గా లిప్‌స్టిక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ముఖానికి మేకప్ లేకుండా మహిళలు బయటకు వస్తారేమో కానీ..లిప్‌స్టిక్ లేకుండా మాత్రం అస్సలు రాలేరు. ఎందుకంటే లిప్‌స్టిక్ అనేది ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల రంగు షేడ్స్, లిప్‌స్టిక్‌లు సులభంగా అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా లిప్‌స్టిక్‌లను రసాయనాలు వాడి తయారు చేస్తారు. వాటని పెదాలకు రాసుకొని ఎక్కువసేపు ఉండడం వల్ల పెదవులు నల్లబడవచ్చు లేదా పొడిగా మారవచ్చు. కాబట్టి ఇంట్లోనే సహజసిద్ధంగా లిప్‌స్టిక్‌ను తయారు చేసుకోవచ్చు.
ఇంట్లో తయారుచేసిన లిప్‌స్టిక్ కోసం మీరు పెద్దగా డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదు. కేవలం ఇంట్లో దొరికే వస్తువులతోనే మీరు ఈ లిప్‌స్టిక్‌ను తయారు చేసుకొచ్చు. ఇది పెదవులకు పోషణను అందించడంతో పాటు వాటిని మృదువుగా, గులాబీ రంగులోకి మారుస్తుంది. ఈ వ్యాసంలో, ఇంట్లో లిప్‌స్టిక్‌ను తయారు చేయడానికి ఏ పదార్థాలు అవసరమో, దానిని ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం
హోమ్ మేడ్ లిప్‌స్టిక్‌కు కావాల్సిన పదార్థాలు
- 2-3 టేబుల్ స్పూన్లు బీట్‌రూట్ రసం (తాజాగా తీసినది)
- 1 టేబుల్ స్పూన్ బీస్వాక్స్ లేదా వాసెలిన్
- 1 నుండి 2 చుక్కలు విటమిన్ ఇ ఆయిల్
- 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్
హోమ్ మేడ్ లిప్‌స్టిక్ లిప్ స్టిక్ ఎలా తయారు చేయాలి?
- ఇంట్లోనే లిప్‌స్టిక్ తయారు చేసుకోవడానికి మీరు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. ముందుగా బీట్‌రూట్‌ను మిక్సీలో వేసి రసాన్ని తీసి ఉంచుకొండి.
- తర్వాత ఒక బౌల్ తీసుకొని గ్యాస్ మీద 2-3 నిమిషాలు మరిగించాలి.
- రసం కొద్దిగా చిక్కగా, నురుగుగా మారడం ప్రారంభించినప్పుడు, గ్యాస్ ఆపివేసి పూర్తిగా చల్లబరచండి.
- చల్లారిన తర్వాత, రసాన్ని ఒక గాజు గిన్నెలోకి వడకట్టి, 1 టీస్పూన్ బీస్వాక్స్, 1 టీస్పూన్ గ్లిజరిన్ కలపండి
- గిన్నెను వ్యాక్స్ పేపర్‌తో కప్పి 1 నిమిషం పాటు మైక్రోవేవ్ చేయండి.
- ఇప్పుడు ఈ వేడి మిశ్రమానికి 2 చుక్కల విటమిన్ ఇ నూనె వేసి బాగా కలపండి.
- తయారుచేసిన మిశ్రమాన్ని చిన్న లిప్‌స్టిక్ బాక్స్ లేదా కంటైనర్‌లో నింపండి.
- కనీసం 6 గంటలు లేదా రాత్రంతా సెట్ అవ్వడానికి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.
- అంతే మీ మీ లిప్‌స్టిక్ రెడీ అయినట్టే, దీనిని మీరు ప్రతిరోజూ ఉపయోగించవచ్చు.
- దీన్ని రోజూ వాడటం వల్ల, మీ పెదవులు గులాబీ రంగులో, మృదువుగా, సహజంగా మెరుస్తూ కనిపిస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
