
ముఖంలో అందర్నీ ఎట్రాక్ట్ చేసే వాటిల్లో ముఖ్యమైనవి నవ్వే పెదాలు. లిప్స్ అందంగా, లేత గులాభి కలర్ లో, సాఫ్ట్ గా ఉండాలని అనుకోని వారుండరు. వాతావరణం మార్పుల వల్ల, తినే ఫుడ్స్ హ్యాబిట్స్, లిప్స్ స్టిక్స్ సరిగ్గా క్లీన్ చేయకపోయినా, దుమ్ము, ధూళి, మెలనిన్ ఉత్పత్తి ఎక్కువ అయినప్పుడు, డీ హైడ్రేషన్ వంటి కారణాల వల్ల కొంత మందికి లిప్స్ అనేవి నల్లగా ఉంటాయి. దీంతో ఏం చేయాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లిప్ స్టిక్స్ వేసినా పెద్దగా మార్పు ఉండదు. ఇలా నల్లగా మారిన పెదాలను నేచురల్ గా బేబీ పింక్ కలర్ లోకి తీసుకు రావచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
నిమ్మ రసం – తేనె:
పెదాలను మెరిపించడంలో నిమ్మ రసం – తేనే బాగా హెల్ప్ అవుతాయి. వీటిని సమ పాల్లలో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వత ఈ మిశ్రమాన్ని పెదాలపై మృదువుగా అప్లై చేయండి. ఇలా వారంలో రెండు సార్లు అప్లై చేస్తే సరిపోతుంది. నిమ్మ రసం పెదాలపై ఉండే మచ్చలను తొలగిస్తుంది. అలాగే తేనే సాఫ్ట్ గా, తేమ ఉండేలా చేస్తుంది. ఈ టిప్ మీకు బాగా ఉపయోగ పడుతుంది.
గులాభి రేకుల పేస్ట్:
మీ పెదాలు గులాభి రంగులో ఎట్రాక్టీవ్ గా కనిపించాలంటే.. గులాభీ రేకుల పేస్ట్ ని పెదాలపై రాయండి. ఈ పేస్ట్ ని ఓ 15 నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసుకుంటే సరి. ఈ పేస్ట్ వలన పెదాలు కలర్ మారడమే కాకుండా.. తేమగా ఉంటాయి. గులాభి రేకులు పిగ్మంటేషన్ ను తొలగించేందుకు సహాయం చేస్తుంది.
కీరా:
కీరా దోశ కూడా పెదాల కలర్ మార్చేందుకు బాగా హెల్ప్ చేస్తుంది. కీరాలను ముక్కలుగా కట్ చేసి పెదాలపై 10 నుంచి 15 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. కీరాలో ఉండే నేచురల్ బ్లీచింగ్ గుణాలు.. పెదాలపై ఉన్న పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది.
ఆలీవ్ ఆయిల్ – పంచదార:
ఆలీవ్ ఆయిల్ లో కొంచెంద పంచదార కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై రాసి చాలా సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు క్లీన్ అవుతాయి. పెదాలపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగుతాయి. ఈ స్క్రబ్ అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటే పెదాలు రంగు మారతాయి.
కలబంద గుజ్జు:
కలబంద గుజ్జులో నేచురల్ యాంటీ బ్యాక్టీరియల్, ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కలబందతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. కలబంద గుజ్జు పెదాల రంగు మార్చడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. కాస్త అలోవెరా గుజ్జు తీసుకుని.. పెదాలపై వేసి కాసేపు సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే.. పెదాలపై ఉండే నలుపు పోయి.. లిప్స్ లేత గులాభి రంగులోకి మారతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.