Yellow Teeth : తెల్లని ముత్యాల్లాంటి దంతాల కోసం ఇంటి నివారణ చిట్కాలు..! ఇలా చేస్తే మీ చిరునవ్వులో మెరుపు ఖాయం..!!
చాలామందికి దంతాలు పసుపు పచ్చగా ఉంటాయి. ఆ రంగు తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి లాభాలు కనిపించవు. మరి బయట షాపుల్లో దొరికే వాటిని వాడుదాం అనుకుంటే.. సమస్య మరింత పెరిగిపోతుంది. కనుక ఇంట్లోని పదార్థాలు ఉపయోగించండి. దంతాల రంగు మారుతుంది. అంతేకాదు.. చిగుళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అలాంటి పదార్థాలేవో ఇక్కడ తెలుసుకుందాం..
Yellow Teeth : తెల్లటి ముత్యాల్లాంటి దంతాలు కావాలని ప్రతి ఒక్కరూ కోరకుంటారు. తెల్లటి దంతాలు మన విశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి. పసుపు దంతాల కారణంగా కొంతమంది నవ్వడానికి కూడా వెనుకాడతారు. తెల్లగా ఉండే దంతాలు మనం నవ్వుతూ, ఆత్మవిశ్వాసంతో పనిచేయడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, మనం తినే ఆహారాలు, తాగే పానీయాలు, వయస్సు కారణంగా మన దంతాల్లో సమస్యలకు కారణమవుతాయి. అలాగే దంతాల రంగు మారడానికి దారితీస్తాయి. వివిధ కారణాల వల్ల చాలా మందిలో దంతాలు పసుపు రంగులోకి మారతాయి. చాలామందికి దంతాలు పసుపు పచ్చగా ఉంటాయి. ఆ రంగు తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి లాభాలు కనిపించవు. మరి బయట షాపుల్లో దొరికే వాటిని వాడుదాం అనుకుంటే.. సమస్య మరింత పెరిగిపోతుంది. కనుక ఇంట్లోని పదార్థాలు ఉపయోగించండి. దంతాల రంగు మారుతుంది. అంతేకాదు.. చిగుళ్లు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. అలాంటి పదార్థాలేవో ఇక్కడ తెలుసుకుందాం..
ఉప్పు.. ఇది పళ్లపై పేరుకుపోయిన మరకలను తొలగించి దంతాలు తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. కొద్దిగా ఉప్పు వేలితో తీసుకుని దంతాలను తోముకోవడం వల్ల పసుపు రంగు తొలగిపోయి తెల్లని రంగు వస్తుంది. సుమారు 1-2 నిమిషాలు ఉప్పుతో మీ దంతాలను బ్రష్ చేయండి. చాలా గట్టిగా స్క్రబ్ చేయకుండా జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఎక్కువ గట్టిగా బ్రష్ చేయడం వల్ల పంటి ఎనామిల్, చిగుళ్లు దెబ్బతింటాయి. బ్రష్ చేసిన తర్వాత మీ నోటిని నీటితో బాగా కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల దంతాలకు రంగు వస్తుంది.
కొబ్బరి నూనె పుల్లింగ్ నోటిని శుభ్రపరుస్తుంది. చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దంతాలు తెల్లగా మారుతాయి. మీ నోటిలో నూనె పోసుకున్న తర్వాత, 10-20 నిమిషాల పాటు పుక్కిల్లించాలి.. ఇది నోటిలోని అన్ని భాగాలకు చేరేలా చూసుకోవాలి. లోపలికి మింగేయకుండా చూసుకోండి..ఇందుకోసం మంచి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఉపయోగించండి.
యాపిల్ సైడర్ వెనిగర్ చిగుళ్ల పరిశుభ్రత, దంతాలు తెల్లబడటంలో సహాయపడటానికి సహజ మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు. రోజుకు రెండుసార్లు ఆపిల్ సైడర్ వెనిగర్ నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోండి. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది.
దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడే మరొక పదార్ధం బేకింగ్ పౌడర్, నిమ్మరసం. రెండింటినీ కొద్దిగా తీసుకుని దంతాల మీద బాగా రుద్ది 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత కడగాలి. ఇది దంతాల రంగును తెల్లగా మార్చేయడానికి సహాయపడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..