High Cholesterol: ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఒంట్లో కొవ్వు పెరిగినట్లే..! కరిగించాలంటే ఇలా చేయండి..
సాధారణంగా డిస్లిపిడెమియా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా గుండె సమస్యలు, స్ట్రోక్‌లు తలెత్తుతాయి. మెదడుకు సరైన ఆక్సిజన్ సరఫరా అందనప్పుడు శారీరక వైకల్యం నుంచి మరణం వరకు అనేక సమస్యలు తలెత్తుతాయి. దీనిని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం..

డిస్లిపిడెమియా గురించి మీరెప్పుడైనా విన్నారా? రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి అసాధారణంగా మారితే దానిని డిస్లిపిడెమియా అంటారు. ఇది వచ్చిన వారిలో శరీరానికి హానికరమైన తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ పెరుగుదల, మంచి కొలెస్ట్రాల్ అని పిలువబడే అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ తగ్గుదల కనిపిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలు, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకు దారితీస్తాయి. అంతేకాదు, కొన్నిసార్లు అవి ప్రాణాంతకం కూడాకావచ్చు. అందువల్ల ఈ సమస్యలకు దూరంగా ఉండటానికి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం. ఇందుకోసం మన జీవనశైలిపై శ్రద్ధ పెట్టాలి. కాబట్టి కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి ఆహారం తినాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా డిస్లిపిడెమియా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా గుండె సమస్యలు, స్ట్రోక్‌లు తలెత్తుతాయి. మెదడుకు సరైన ఆక్సిజన్ సరఫరా అందనప్పుడు శారీరక వైకల్యం నుంచి మరణం వరకు అనేక సమస్యలు తలెత్తుతాయి. దీనిని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం.
సమస్య తీవ్రమైనప్పుడు కనిపించే లక్షణాలు ఇవే..
- ఛాతీ నొప్పి
- శ్వాస ఆడకపోవుట
- అలసట
- అధిక రక్తపోటు
- హృదయ స్పందన రేటులో హెచ్చుతగ్గులు
కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏం చేయాలి?
శరీరం అవసరమైన మొత్తంలో కొలెస్ట్రాల్‌ను స్వయంగా ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల దీని కోసం ఇతర ఆహారాలు తినవలసిన అవసరం లేదు. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్‌లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు వస్తాయి. దీనిని నివారించడానికి సంతృప్త కొవ్వు ఆహారాలను తగ్గించాలి. జున్ను, పాలతో తయారు చేసిన డెజర్ట్‌లను తీసుకోవడం తగ్గించాలి.
మరైతే ఎలాంటి ఆహారం తినాలి?
లీన్ మీట్స్, సీఫుడ్, పాలు, చీజ్, పెరుగు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఓట్స్, బీన్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్, గింజలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
బరువును నియంత్రణలో ఉంచుకోవాలి
అధిక బరువు, ఊబకాయం చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు దారితీస్తాయి. అందువల్ల బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గుండె సమస్యలు, స్ట్రోక్స్ వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. వయస్సు, ఎత్తుకు తగిన బరువు ఉంటే సరిపోతుంది. అంతే కాదు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తుండాలి. ఈ అలవాటు బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. సైక్లింగ్, వాకింగ్ వంటి చిన్నపాటి వ్యాయామాలు (ఎక్సర్‌సైజ్‌లు) చేయాలి. రోజుకు అరగంట నుంచి గంట వరకు ఈ ఎక్సర్‌సైజ్‌లు చేస్తే సరిపోతుంది.
ధూమపానం, మద్యం అలవాట్లు వెంటనే వదిలేయాలి
ధూమపానం రక్త నాళాలను దెబ్బతీస్తుంది. అంతేకాకుండా ధమనులు గట్టిపడి గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి పొగాకుకు దూరంగా ఉండాలి. ధూమపానం కూడా మానేయాలి. అధికంగా మద్యం సేవించడం వల్ల ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. కాబట్టి మద్యం, సిగరేట్లు అలవాట్లు వెంటనే మానుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.








